Trending

6/trending/recent

AP Curfew Extended: ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు వర్తింపు

 Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి కొనసాగుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయాలని తెలిపారు. అలాగే రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసారు.

ఇదిలా ఉంటే కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే ఎక్కువ ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులను ప్రకటించారు. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. కాగా, జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వరిస్తాయని తెలిపారు. పాజిటివిటీ రేటును పరిశీలించాక ఈ జిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేసారు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad