Trending

6/trending/recent

Singapore Covid variant: 3rd వేవ్ లో వస్తుందంటున్న సింగపూర్ వేరియంట్ అంటే ఏంటి? పిల్లలకు ప్రమాదమా?

 Singapore Covid variant: ఇప్పుడు ఇండియాలో సింగపూర్ వేరియంట్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. దానిపై రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. కానీ అసలు వాస్తవం తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకో చూద్దాం.

Singapore Covid variant: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో... వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ... సింగపూర్ వేరియంట్ వల్ల పిల్లలకు ఎక్కువగా కరోనా సోకే ప్రమాదం ఉందనీ... సింగపూర్‌కి విమాన సర్వీసులు ఆపేయాలని కోరారు. అదే సమయంలో... థర్డ్ వేవ్‌లో పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనాలు తెరపైకి వస్తుంటే... దేశం మొత్తం ఒక్కసారిగా సింగపూర్ వేరియంట్‌పై భయంకరమైన ప్రచారం మొదలైంది. ఈ అంశంపై లోతుగా వెళ్తే... ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇక్కడ సింగపూర్ వేరియంట్ అంటే... B.1.617. చాలా మంది ఈ వేరియంట్... త్వరలోనే ఇండియాకు వస్తుందనీ... పిల్లలకు ప్రమాదం అని భావిస్తున్నారు. కానీ... ఈ వేరియంట్ ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలోనే ఉంది. దీన్ని అనధికారికంగా ఇండియన్ వేరియంట్ అని పిలుస్తున్నారు. దీన్నే డబుల్ మ్యూటెంట్ వేరియంట్ (E484Q and L452R) అని కూడా పిలుస్తున్నారు. దీని వల్ల సెకండ్ వేవ్‌లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతుండటాన్ని మనం చూస్తున్నాం. ఐతే... దీనివల్లే కరోనా బారిన పడుతున్నారనేందుకు ఆధారాలు లేవు.

కేజ్రీవాల్ చేసిన ప్రకటనతో... సింగపూర్ వేరియంట్ అనే పదం తెరపైకి వచ్చింది. అసలు సింగపూర్‌లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సింగపూర్ ప్రభుత్వం... కొత్త కొత్త మ్యూటెంట్ కరోనా వైరస్‌లు వస్తున్నాయనీ... ముఖ్యంగా B.1.167 వేరియంట్... చిన్న, మధ్య వయసు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపగలిగేలా ఉందని అంది. తమ దేశంలోని అన్ని స్కూళ్లనూ బుధవారం (నేడు) నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల ఇవాళ్టి నుంచి ఆ దేశంలో ప్రాథమిక, సెకండరీ స్కూల్లు, జూనియర్ కాలేజీలు మూతపడ్డాయి. ఇక ఆన్‌లైన్ క్లాసులు నేటి నుంచి జరుగుతున్నాయి. మే 28 వరకూ ఇవి జరుగుతాయి.

సింగపూర్ ప్రభుత్వం చేసిన ప్రకటనతో కంగారుపడిన కేజ్రీవాల్... ప్రధానితో దీనిపై మాట్లాడారు. ఐతే... ఈ వేరియంట్... సింగపూర్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉందన్నది వాస్తవం. ఇప్పటివరకూ సింగపూర్‌లో ఎంత మంది పిల్లలు ఈ వేరియంట్ బారిన పడ్డారో లెక్కలు లేవు. ఆ దేశ ఆర్యోగ శాఖ జస్ట్ ఓ అంచనాగా పిల్లలకు సోకగలదు అని చెప్పిందే తప్ప... కచ్చితమైన ఆధారాలు లేవు.

సింగపూర్‌లో సోమవారం 38 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 నెలల్లో అవే అత్యధికం. వాటిలో ఓ ట్యూషన్ సెంటర్‌లో నలుగురు పిల్లలకు కూడా కరోనా సోకిన కేసులు ఉన్నాయి. ఆ సోకిన కరోనా B.1.167 వేరియంటా లేక వేరేదా అన్నది తేలలేదు. అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యి... ఈ ప్రకటన చేసింది.

సో... సింగపూర్ నుంచి ఆ వేరియంట్ ప్రత్యేకంగా ఇండియాకి రావాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇక్కడ ఫుల్లుగా ఉంది. మన దేశ పరిశోధకుల ప్రకారం... థర్డ్ వేవ్‌ నవంబర్‌లో రావచ్చు అంటున్నారు. అప్పుడు ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపగలదు అంటున్నారు. అది అంచనా మాత్రమే. అప్పుడు ఏ వేరియంట్ ఉంటుందో, ఎవరిపై ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు. అసలు థర్డ్ వేవ్ కచ్చితంగా వస్తుంది అనేందుకు కూడా ఆధారాలు లేవు. అన్నీ అంచనాలే. కాకపోతే... పిల్లల విషయంలో మాత్రం పేరెంట్స్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ చెబుతున్నారు. అందువల్ల అప్రమత్తంగా ఉండటం, వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిదే.

కేజ్రీవాల్ చెప్పినట్లుగా అక్కడ ఏదైనా కొత్త వేరియంట్ ఉన్నా... అది ఇండియాకి వచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే 2020 మార్చి నుంచి సింగపూర్‌తో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు. వందే భారత్ మిషన్‌లో భాగంగా కొన్ని విమానాలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు.



ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)... B.1.617 వేరియంట్‌ను ప్రపంచానికి ఆందోళన కలిగించే వేరియంట్‌గా చెప్పింది. అంతే తప్ప ఇండియన్ వేరియంట్ అని మాత్రం చెప్పలేదు. ఇప్పటివరకూ ఈ వేరియంట్ 40 దేశాలకు విస్తరించినట్లు అంచనాలు ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చిన ప్రయాణికుల వల్లే తమ దేశంలోకి ఈ వేరియంట్ వచ్చిందని చాలా దేశాలు అంటున్నాయి. ఈ వాదనను ఇండియా ఖండిస్తోంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad