Trending

6/trending/recent

Posta Office PPF Account: 9వేల రూపాయల పొదుపుకు 29 లక్షల భారీ ప్రయోజనం..! అదనంగా పన్ను మినహాయింపు.. తెలుసుకోండి

 Post Office PPF Account : ప్రభుత్వ పెట్టుబడుల కోసం నేడు మార్కెట్లో చాలా ఎంపికలు ఉన్నాయి. వాటిలో ఒకటి పోస్టాఫీసులో డబ్బు పెట్టుబడి పెట్టడం. ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్, రికరింగ్ డిపాజిట్ వంటి అనేక పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ రోజు పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఈ ఖాతా గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో మీ డబ్బు పూర్తి హామీతో పెరుగుతుంది. పన్ను రిబేటు లెక్కతో లభిస్తుంది. ఈ పోస్టాఫీసు పథకం మీ ఉద్యోగ విరమణకు మంచి ఎంపిక.

పిపిఎఫ్ ఖాతా పదవీకాలం15 సంవత్సరాలు. తరువాత కూడా మీరు పెంచుకోవాలంటే మరో 5 సంవత్సరాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకం ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి చాలా మంచిది. ఈ పథకం ద్వారా మీరు మీ ఉద్యోగ విరమణ ప్రణాళికను మీరే చేసుకోవచ్చు. పిపిఎఫ్ కాలిక్యులేట్ ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతి నెలా పిపిఎఫ్ ఖాతాలో 9,000 రూపాయలు జమ చేస్తే 15 సంవత్సరాల తరువాత అతనికి రూ.29,29,111 లభిస్తుంది. దీంతో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనం ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 1.5 లక్షల రూపాయల వరకు తగ్గింపు తీసుకోవచ్చు. పిపిఎఫ్‌లో సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం రెండూ పన్ను మినహాయింపే.

పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ అకౌట్ దీర్ఘకాలికంగా అధిక లాభాలను ఇచ్చే చిన్న పొదుపు పథకాల్లో ఒకటి. ప్రస్తుతం పిపిఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ అమలులో ఉంది. ఇది ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ. మీరు ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో పిపిఎఫ్ ఖాతా తెరవవచ్చు. ఏ కారణం చేతనైనా మీ ఖాతా మూసివేయబడితే చింతించాల్సిన పనిలేదు. మీరు 500 రూపాయలు జమ చేయడం ద్వారా మళ్ళీ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు పోస్టాఫీసులో లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాలి. పోస్టాఫీసులో పిపిఎఫ్ ఖాతా తెరవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే అందులో సంపాదించిన వడ్డీకి సార్వభౌమ హామీ ఉంది. ఇది బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ భద్రతను కలిగిస్తుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad