Trending

6/trending/recent

Online Banking: ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసే వారికి అలర్ట్.. ఈ 12 తప్పులు అస్సలు చేయకండి

 సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అనేక మందికి వారికి తెలియకుండా ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయి. అయితే ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరాలను నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో ప్రభుత్వాలు, వివిధ సంస్థలు జన సామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అయితే పబ్లిక్ వైఫై ఉపయోగించి ఆన్లైన్ బ్యాంకింగ్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే హ్యాకర్లు సులువుగా మీ బ్యాంకు ఖాతా వివరాలు చోరీ చేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

అలాగే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఫోన్లకు ఛార్జింగ్ ఉంచడం మంచిది కాదు. తద్వారా మీ డేటాను దొంగిలించే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ సొంత ఛార్జింగ్ కేబుల్ ను వెంట తీసుకెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

బ్యాంకు ఫోన్ నంబర్లు, ఇతర సమాచారం కోసం గూగుల్ లో వెతకడం అంత మంచిది కాదు. ఎల్లప్పుడూఅధికారిక వెబ్ సైట్లోనే ఆ వివరాలు తెలుసుకోవడం మంచిది.

యాప్ లను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే లింకుల ద్వారా యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు.

మన ఫోన్ కు వచ్చే సెక్యూరిటీ అప్ డేట్లను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేసుకుంటే హ్యాకర్ల భారిన పడే ప్రమాదం చాలా తక్కువ.

సోషల్ మీడియా, ఇంటర్ నెట్లో, మెయిల్, ఎస్ఎంఎస్ లలో కనిపించే బ్యాంకు ట్రాన్సాక్షన్లకు సంబంధించిన లింక్ లపై అస్సలు క్లిక్ చేయకండి. ఒకటికి రెండు సార్లు సరి చూసుకున్నాకే వాటిపై క్లిక్ చేయడం మేలు.

మీ బ్యాంకింగ్, కేవైసీకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచిది కాదు. తద్వారా మీ సమాచారం హ్యాకర్ల పాలయ్యే ప్రమాదం ఉంటుంది.

బ్యాంకు ఖాతాలకు సంబంధించి పాస్ వర్డ్ లు చాలా పెద్దవిగా, స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి. పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన సులువైన పాస్వర్డ్ లను పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు.

బ్యాంక్ ఆన్ లైన్ ఖాతాలకు సంబంధించిన పాస్ వర్డ్ లను తరచుగా మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే హ్యాకింగ్ బారిన పడే ఛాన్స్ చాలా తక్కువ.

మనం రెగ్యులర్ గా వినియోగించే ఈమెయిల్స్, ఫోన్ నంబర్లను మాత్రమే బ్యాంకు ఖాతాలకు లింక్ చేయాలి. లేక పోతే బ్యాంకు నుంచి వచ్చే సెక్యూరిటీ అలర్ట్స్, ఇతర సమాచారాన్ని పొందలేము.

బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఎవరైనా మీ ఖాతా, డెబిట్ కార్డుల వివరాలు అడిగితే అస్సలు చెప్పొద్దు. అనుమానం వస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.

మనం ఫోన్లో వినియోగించుకునే యాప్ లకు అనవసరమైన పర్మిషన్లు ఇవ్వొద్దు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad