Trending

6/trending/recent

New vaccine: ఇండియాలో మరో కరోనా వ్యాక్సిన్ తయారీ... మోస్ట్ పవర్‌ఫుల్

 New Covid vaccine: కరోనానా... ప్రపంచ మానవాళా... తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ వైరస్‌ను అంతం చేయడానికి ఇప్పుడు మరో కొత్త అస్త్రం దొరికింది. దాంతో కొత్త వ్యాక్సిన్ తయారీ మొదలైంది. పూర్తి వివరాలు ఇవే.

New Covid vaccine: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వ్యాక్సిన్ తయారీ ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్ అలాంటిలాంటిది కాదు. ఇది ప్రత్యేకించి ఇండియాలో సోకుతున్న మొండి కరోనా వైరస్‌ని అంతం చెయ్యగలదంటున్నారు. ఎందుకంటే... IISCలోని మాలిక్యూలర్ బయోఫిజిక్స్ యూనిట్‌లోని వారు... ప్రత్యేకమైన మాలిక్యూల్స్‌ని కనిపెట్టారు. ఇవి చాలా శక్తిమంతమైనవి అనీ... కరోనాతో బాగా పోరాడగలవని చెబుతున్నారు. ఎలాగంటే... ఈ మాలిక్యూల్స్‌ని వ్యాక్సిన్ రూపంలో శరీరంలో ప్రవేశపెడితే.. ఇవి పెద్ద సంఖ్యలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యేలా చెయ్యగలవు అంటున్నారు. ఇప్పుడు మనం వేయించుకుంటున్న వ్యాక్సిన్లతో వచ్చే యాంటీ బాడీల కంటే.. ఈ కొత్త వ్యాక్సిన్‌తో వచ్చే యాంటీబాడీలు చాలా ఎక్కువ అంటున్నారు.

ఇప్పటికే ఈ కొత్త మాలిక్యూల్స్‌ని జంతువులపై ప్రయోగించారు. అంటే... చుంచెలుకలు, హామ్‌స్టెర్స్‌పై ట్రయల్స్ చేశారు. ఇప్పుడు కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు ఎన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయో... వాటికంటే 8 రెట్లు ఎక్కువ సంఖ్యలో ఈ కొత్త మాలిక్యూల్స్ వల్ల యాంటీబాడీలు జంతువుల్లో ఉత్పత్తి అయినట్లు తెలిపారు.

"కొత్త వేరియంట్లను ఎదుర్కొనే శక్తి... ఈ కొత్త వ్యాక్సిన్‌కి ఉంది. ఎందుకంటే... కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి ఎన్ని యాంటీబాడీలు కావాలో... అంత కంటే ఎక్కువే దీని వల్ల ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి... మనుషులకు ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు... ఒకవేళ యాంటీబాడీలు కాస్త తక్కువ ఉత్పత్తి అయినా... అప్పటికీ... కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు అవుతుంది" అని IIScలో మాలిక్యూలర్ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ తెలిపారు.

ప్రత్యేకమైన వ్యాక్సిన్:

ఈ కొత్త వ్యాక్సిన్ గురించి మనం కొంత మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే... ఇది మన ఇండియన్ వాతావరణానికి సెట్ అయ్యే వ్యాక్సిన్. ఇది వేడి వ్యాక్సిన్. అంటే... దీన్ని ఫ్రిజ్‌లో ఉండాల్సిన పనిలేదు. గదిలో సాధారణ ఉష్ణోగ్రతలోనే ఉంచవచ్చు. ప్రస్తుతం ఇండియాలో వాడుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వంటి వాటికి కోల్డ్ స్టోరేజ్‌లు అవసరం. ఈ కొత్త వ్యాక్సిన్‌కి వాటితో పనిలేదు.

ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?

ఈ వ్యాక్సిన్‌ని సబ్ యూనిట్ వ్యాక్సిన్ అంటున్నారు. "కరోనా వైరస్ చుట్టూ కొవ్వు లాంటి ప్రోటీన్ పదార్థం... ముళ్ల రూపంలో ఉంటుందని మీకు తెలుసు కదా. ఈ ముళ్లు కణానికి అతుక్కుంటాయి. ఈ ముళ్ల ప్రోటీన్ మొత్తం 1700 అమైనో యాసిడ్లతో ఉంటుంది. ఇందులో 200 అమైనో యాసిడ్లు కణానికి అతుక్కుంటాయి. ఇలా అతుక్కోకుండా చెయ్యడం ఇప్పుడున్న వ్యాక్సిన్లకు కుదరట్లేదు. మా వ్యాక్సిన్ వాటికి భిన్నమైనది. మాది సబ్ యూనిట్ వ్యాక్సిన్. మాది కరోనాను సమర్థంగా ఎదుర్కొంటుంది" అని వరదరాజన్ తెలిపారు. ఈ ల్యాబ్ నాలుగేళ్లుగా ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ తయారీపై దృష్టిపెట్టింది. ఇంతలో కరోనా రావడంతో... గతేడాది కరోనా వ్యాక్సిన్ తయారీపై ఫోకస్ పెట్టింది.

ఈ వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుంది?

జంతువులపై క్లినికల్ ట్రయల్స్ 6 నెలల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత మనుషులపై ట్రయల్స్ మరో 4 నెలల్లో పూర్తవుతాయి. అంటే... ఓ సంవత్సరం తర్వాత ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఆ లోగా ఇండియాలో థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. లేటుగా వచ్చినా తమది సరైన వ్యాక్సిన్ కాబట్టి... ఇది అందరికీ ఉపయోగపడుతుందని వరదరాజన్ చెబుతున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad