Trending

6/trending/recent

Lock Down: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ.. లాక్‌ డౌన్‌పై కీలక నిర్ణయం ?

Lock Down: ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఢిల్లీ, కర్ణాటకలో లాక్ డౌన్ నడుస్తోంది. ఇటు ఏపీలో కూడా ఇవాల్టి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్‌పై కేంద్రం కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం..

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న వేళ కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. దేశంలో భారీగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ విషయంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు.

ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం సాగనుంది. సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, టీకాలు, అవసరమైన ఔషధాలపై లభ్యత తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కరోనా పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్లు వినపడుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ నిపుణులుసైతం భారత్‌లో లాక్ డౌన్ విధిస్తేనే మంచిదని సూచిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. కనీసం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టి, మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించే అవకాశముంది. దీంతో ఇవాళ కేంద్ర కేబినెట్‌లో మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad