Trending

6/trending/recent

Ikea Buy back: మీ పాత ఫర్నీచర్ ను మార్చాలనుకుంటున్నారా? అయితే, 50 శాతం ధరకు దాన్ని అమ్మే ఛాన్స్.. ఎలాగంటే..

 ఫర్నిచర్​ అమ్మకాల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న స్వీడన్​ కంపెనీ ఐకియా సరికొత్త పథకంతో వినియోగదానుల ముందుకు వచ్చింది. పాత ఫర్నీచర్ ను 50 శాతం ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫర్నిచర్​ అమ్మకాల్లో ప్రపంచ దిగ్గజంగా కొనసాగుతున్న స్వీడన్​ కంపెనీ ఐకియా.. 2030 నాటికి "క్లైమేట్ పాజిటివ్" గా మారడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఫర్నిచర్​ బైబ్యాక్, రీసేల్​ స్కీమ్​లను ప్రారంభించింది. వ్యర్ధాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఈ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐకియాలో కొనుగోలు చేసిన ఫర్నిచర్​ను కొంతకాలం వినియోగించిన తర్వాత మళ్లీ ఐకియా స్టోర్​లో ఇవ్వవచ్చు. దీనికి గాను వారికి బైబ్యాక్​ వోచర్లు ఇస్తారు. ఈ వోచర్లను వినియోగించి ఇతర వస్తువులను డిస్కౌంట్​లో కొనుగోలు చేయవచ్చు. అయితే కస్టమర్లు రిటన్​ చేసే వస్తువులు మెరుగైన స్థితిలో ఉండాలని ఐకియా పేర్కొంది. బ్రిటన్​లో అనేక నగరాల్లో ఈ పథకాలను అమలు చేసిన తర్వాత దీన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఎలాంటి పగుళ్లు, గీతలు లేకుండా కొత్తగా ఉన్న వస్తువులను వాటి ధరలో 50 శాతానికి తిరిగి కొనుగోలు చేస్తామని ఐకియా తెలిపింది. చిన్న గీతలు ఉన్న వస్తువులు 40 శాతానికి, బాగా స్క్రాచెస్​ ఉన్న ఫర్నిచర్ను 30 శాతానికి కొనుగోలు చేస్తారు.

‘పారిశ్రామిక వ్యర్థాలను తగ్గించడానికి, మా కస్టమర్లకు ప్రయోజాలను చేకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై ముందు కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్​లను నిర్వహించాం. అక్కడ విజయవంతం కావడంతో తొలుత యూకేలోని అన్ని ఐకియా స్టోర్లలో పథకాలను ప్రారంభించాలని నిర్ణయించాం’ అని ఐకియాలో పర్యావరణ, సస్టేనెబిలిటీ ఎక్స్​పర్ట్​ హెగే సేబ్జోర్న్సెన్ అన్నారు.

క్లెమేట్​ పాజిటివ్ లక్ష్యంగా..

ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా సెకండ్ హ్యాండ్ ఉత్పత్తులను విక్రయించడానికి గుమ్‌ట్రీతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, వీటిని ఐకియా స్టోర్లలోనే విక్రయిస్తారు. డ్రస్సర్స్, క్యాబినెట్స్, బుక్‌కేసెస్​, షెల్ఫ్ యూనిట్లు, చిన్న టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, డెస్క్‌లు వంటి ఉత్పత్తులను బైబ్యాక్​ చేయవచ్చు. 2030 నాటికి పూర్తిగా వ్యర్థ పదార్థాలను తొలగించాలని ఈ స్వీడన్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఫర్నిచర్ తిరిగి అమ్మాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడానికి Ikea.co.uk వెబ్​సైట్​ను సందర్శించాలి. మీ వస్తువులకు ఎంత మేర బైబ్యాక్​ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ఈ స్కీమ్​లను గతేడాది నవంబర్‌లో ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి ఈ పథకాలను యూకేలోని ఐకియా స్టోర్స్‌లో అందుబాటులో ఉంచారు. త్వరలోనే ఐకియా స్టోర్స్ ఉన్న ఇతర 26 దేశాలలో కూడా దీన్ని ప్రారంభించనున్నారు. ఐకియా భారత్​లో సైతం తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. వచ్చే ఏడేళ్లలో భారత్​లో ముప్పై నగరాల్లో కొత్త అవుట్​లెట్స్​ తెరవాలని యోచిస్తోంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad