Trending

6/trending/recent

Hair Fall After Corona: కొవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు రాలుతుందా..? ఈ సమస్య అందరికి వస్తుందా..! తెలుసుకోండి..

 Covid Recovered Patients : శారీరక, మానసిక ఒత్తిడి కారణంగా కోవిడ్ అనంతరం రోగులలో జుట్టు రాలుతోంది. టెలోజెన్ ఎఫ్లూవియం అని పిలువబడే తాత్కాలిక రివర్సిబుల్ హెయిర్ లాస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్యులు అంటున్నారు. వారి ప్రకారం.. వ్యాయామం, డి-స్ట్రెస్సింగ్, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలడం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. కోవిడ్ -19 నుంచి రోగి కోలుకున్న రెండు లేదా మూడు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. 55 రోజుల తర్వాత వీపరీతంగా జుట్టు రాలుతుంది.

జ్వరం కారణంగా, ఆహారం మార్పులు, ఒంటరితనం వల్ల ఒత్తిడి, ఆర్థిక చింతలు లేదా ఉద్యోగం పోతుందనే భయం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ఈ జుట్టు రాలడాన్ని టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. నిపుణులు ఏం చెబుతున్నారంటే కొవిడ్ అనంతరం రోగులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో జుట్టు రాలడం సమస్య వస్తుందని కరోనా రోగులపై చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరో విషయం ఏంటంటే కేవలం కొవిడ్ వల్ల మాత్రమే ఈ సమస్య రావడం లేదని దీనికి చాలా సమస్యలు తోడవుతున్నాయని తెలిపారు.

ఆహారంలో మార్పులు, బరువు తగ్గడం, ఆకస్మిక హార్మోన్ల మార్పులు, ఐరన్ లోపం ఇతర అంశాల వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. టెలోజెన్ ఎఫ్లూవియం ఒక తాత్కాలిక పరిస్థితి. ఇది జుట్టు రాలడం ప్రారంభమైన మూడు నుంచి ఆరు నెలల్లో మెరుగుపడుతుంది. అయితే ఈ సమస్యకు డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి వెంటనే వీడ్కోలు పలుకాలన్నారు. అప్పుడే జుట్టు రాలడం ఆగుతుందన్నారు. ప్రతిరోజు ధ్యానం, శ్వాస నియమాలు పాటించాలని సూచించారు. ఆహారంలో కూరగాయలు, బచ్చలికూర, పాలకూర, నారింజ, అత్తి పండ్లను, క్యాప్సికమ్ వంటి పండ్లను తినండని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు సరిపడేంత నిద్ర పోవాలని అప్పుడే జుట్టు సమస్యలు తొలగిపోతాయని తెలిపారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad