Trending

6/trending/recent

Gold Rate 3-5-2021: 10 రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు... నేటి రేట్లు ఇవీ

 Gold rate and Silver price 3-5-2021: బంగారం ధరల్లో మార్పు కనిపిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి పెరుగుతూ... ఏప్రిల్ 22 వరకూ దూసుకెళ్లిన బంగారం ధరలు ఆ తర్వాత 10 రోజులుగా తగ్గుతున్నాయి. తాజా అప్‌డేట్స్ చూద్దాం.

Gold and Silver rate 3-5-2021: బంగారం నగలు కొనుక్కోవాలి అనుకుంటున్నారా... అయితే ఇదో మంచి అవకాశం దేశ ఆర్థిక పరిస్థితులు మళ్లీ మెరుగవుతాయి అనే అంచనా ప్రజల్లో కనిపిస్తోంది. దాంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారు బంగారంపై ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. అందువల్ల గత 10 రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ వేసేయాలని కేంద్రం అనుమతి ఇవ్వడంతో... ఇక ఇండియా కోలుకుంటుంది అనే అంచనాతో ఇన్వెస్టర్లు తమ ఒపీనియన్ మార్చుకుంటున్నారు. అందువల్లే గత వారం స్టాక్ మార్కెట్లు ఒకింత జోరందుకున్నాయి. మరి నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold rate today: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (నేటి బులియన్ మార్కెట్ ప్రారంభానికి ముందు) 10 గ్రాములు రూ.43,800 ఉంది. నిన్న, మొన్న ధరల్లో మార్పు లేదు. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.35,040 ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,380 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.47,780 ఉంది. నిన్న ధరలో మార్పులేదు. తులం బంగారం ధర రూ.38,224 ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,778 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి. 

Silver rate today: వెండి ధరలు నిన్న స్థిరంగా ఉన్నాయి. గత 30 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.4,100 పెరిగింది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.72,800 ఉంది. నిన్న ధరలో మార్పు లేదు. 8 గ్రాములు (తులం) కావాలంటే దాని ధర రూ.582.40 ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. ఒక్క గ్రాము వెండి ధర రూ.72.80 ఉంది. 6 నెలల కిందట అక్టోబర్ 25న వెండి ధర కేజీ రూ.62,500 ఉంది. ఇప్పుడు రూ.72,800 ఉంది. అంటే రూ.10,300 పెరిగింది. 

ఇన్వెస్టర్లకు సవాల్: ఈ సంవత్సరం దేశ ఆర్థిక పరిస్థితులు అంత గొప్పగా లేకపోవడంతో... ఇన్వెస్టర్లకు తమ డబ్బును ఎందులో పొదుపు చేసుకోవాలో తెలియట్లేదు. స్టాక్ మార్కెట్లు, బంగారం, మ్యూచువల్ ఫండ్స్ ఏవీ అంతగా కలిసి రావట్లేదు. ముఖ్యంగా సేఫ్ అని భావించే బంగారం... ఈ సంవత్సరం ప్రారంభంలో ధర పెరిగినా... ఫిబ్రవరి నుంచి ధర తగ్గుతూ, మధ్యలో పెరుగుతూ... మళ్లీ ఇప్పుడు తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ స్టా్క్ మార్కెట్లు పుంజుకుంటాయనే అంచనాతో ఇన్వె్స్టర్లు ఉన్నా... అలాంటి పరిస్థితులు అప్పుడే రావు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. 



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad