Trending

6/trending/recent

Education: విద్యారంగం బలొపేతానికి కృషి

  • సీమ్యాట్‌ ద్వారా ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ ఆ రానున్న రోజుల్లో
  • సీబీఎస్‌ఈ అమలు, ఆరేళ్లలోపు వారి కోసం ప్రీ- ప్రైమరీ స్కూళ్లు
  • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టిపెట్టారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు సీమ్యాట్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో ఖర్చు చేసే ప్రతి పైసా విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడి లాంటిదని అన్నారు. నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులదే అని, బట్టే విధానానికి స్వస్తి చెప్తూ అభ్యాసన ఫలితాలు సాధించేదిశగా బోధన చేయాలని సూచించారు. ఎస్‌సీ ఈఆర్‌టీ విభిన్న విద్యా ప్రణాళికను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన సిలబస్‌తో పాఠ్యపుస్త కాలను, రూపాందించిందన్నారు. ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలను సిద్ధం చూమని, వీటి ముద్రణ ఎంతో ఖరీదైనప్పటికీ ఎన్‌ఈటీ 2020 నిర్దేశాలకు అనుగుణంగా పుస్తకాల రూపకల్పన జరిగిందన్నారు. పుస్తకాలతో పాటు వర్క్‌బుక్స్‌ను కూడా విద్యార్థులు తయారు చేసి అందించామని ఈ పుస్తకాలు దేశంలోనే అత్యున్నత సిలబస్‌తో రూపొందించా మన్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌కు క సమాన స్థాయిలో ఈ సిలబస్‌ ఉందని మంత్రి స్పష్టచేశారు. రానున్న రోజుల్లో ఏడవ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేయనున్నామని పేర్కొన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాసే విధంగా ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఈ నేపథ్యంలో టీచర్లకు సమగ్ర శిక్షణ ఇవ్వాల్సిన తవసరం ఉందని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న అన్‌లైన్‌ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని 50 గంటలు ఆన్‌లైన్‌ శిక్షణలో 24 లైవ్‌ ప్రోగ్రామ్స్‌ ఉన్నాయన్నారు. మొత్తం 21 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ప్రతి టీచర్‌ కనీసం రెండు గంటల పాటు శిక్షణకు కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంవత్సరాల నుంచి అరు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారుల కోసం వైఎస్సార్‌ ప్రీ - ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని పాఠశాలలను మూసి వేయడం జరిగిందన్నారు. పరిస్మితులు అదుపులోకి వచ్చాక పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad