Trending

6/trending/recent

Corona New Study: కరోనా… ICMR సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి

Covid-19 New Study: కరోనా బాధితులకు మరో చేదు వార్త. కొవిడ్-19 రోగులు చికిత్స పొందుతున్న సమయంలో సెకండరీ ఇన్ఫెక్షన్‌కు గురైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

కరోనా బాధితులకు మరో చేదు వార్త. కొవిడ్-19 రోగులు చికిత్స పొందుతున్న సమయంలో సెకండరీ ఇన్ఫెక్షన్‌కు గురైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా లేదా ఫంగల్ సెకండరీ ఇన్ఫెక్షన్లకు గురైన కరోనా రోగుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) వెల్లడించింది. సెకండరీ ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో సగానికి సగం మంది ప్రాణాలను కోల్పోయారు. 10 ఆస్పత్రుల్లోని ఐసీయూలు, వార్డుల్లో చికిత్స పొందిన కొవిడ్ రోగులపై ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

కొందరు కరోనా రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో లేదా కోలుకుంటున్న సమయంలో సెకండరీ ఇన్ఫెక్షన్‌గా బ్యాక్టీరియా లేదా ఫంగస్ బారినపడ్డారు. వీరిలో సగం మంది మాత్రమే చికిత్స తర్వాత కోలుకోగా…మిగిలిన సగం మంది ప్రాణాలు కోల్పోయారు. సదరు 10 ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స పొందిన రోగుల్లో 17,534 మంది (3.6 శాతం) సెకండరీ ఇన్ఫెక్షన్ బారిపడ్డారు. వీరిలో 56.7 శాతం మంది చనిపోగా…మిగిలిన వారు కోలుకున్నారు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే రోగుల్లో మరణాల రేటుతో పోలిస్తే సెకండరీ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్న వారిలో మరణాలు రేటు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తంచేసింది.

సెకండరీ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్న కరోనా పేషెంట్స్‌లో ఎక్కువగా రక్తం, శ్వాసకోస సమస్యలు ఏర్పడుతున్నాయి.
సెకండరీ ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో మందులు సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. అందుకే కరోనా బాధితులకు విపరీతంగా యాంటీ బ్యాక్టీరియల్ మందులు ఇవ్వకుండా…జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచిస్తున్నారు. తద్వారా మందులతో అదుపుచేయలేని ఇన్ఫెక్షన్ల బారితో ప్రాణాలు కోల్పోకుండా రోగులను కాపాడవచ్చని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

సెకండరీ ఇన్ఫెక్షన్ బారినపడే కరోనా రోగుల ట్రీట్మెంట్ కోసం మరిన్ని మందులు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని కూడా ఐసీఎంఆర్ సర్వే నివేదిక నొక్కి చెప్పింది. అలాగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కరోనా  రోగులు సెకండరీ ఇన్ఫెక్షన్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad