Trending

6/trending/recent

Canada: విషాదం.. కెనడాలోని రెసిడెన్షియల్‌ పాఠశాల సమీపంలో 215 మంది స్కూల్ పిల్లల అవశేషాలు గుర్తింపు

 Canada: కెనడాలో 215 మంది పిల్లల అవశేషాలు బయట పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. 1978లో మూసివేయబడిన బ్రిటిష్‌ కమ్లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఈ పిల్లల ఆస్తిపంజరాలను కనుగొన్నారు. ఇందులో చాలా మంది మూడేళ్ల వయసు ఉన్నట్లు గుర్తించారు. ఈ అవశేషాలు భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్‌ స్పెషలిస్ట్‌ సహాయంతో కనుగొన్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాగా, రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్నప్పుడు 4,100 మంది పిల్లలు మరణించినట్లు తేలింది. అయితే ఇందులో 215 మంది పిల్లల వివరాలు చేర్చబడలేదని గుర్తించారు. ఒకప్పుడు కెనడాలో అతిపెద్ద రెసిడెన్షియల్‌ పాఠశాలగా ఉన్న మైదానంలో వీరిని ఖననం చేసినట్లు కనుగొన్నారు. ఈ ఘటన దేశ చరిత్రలో చీకటి రోజు అని ఆ దేశ ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు.

అయితే 1840 నుంచి 1990 వరకు క్రైస్తవ చర్చిలు నిర్వహిస్తున్న పాఠశాలలకు హాజరైన 150,000 మంది పిల్లలలో చాలా మంది భయంకరైన శారీరక వేధింపులు, అత్యాచారాలు, పోషకాహారలోపం మరియు ఇతర దురాగతాలను నివేదిక నమోదు చేసింది. అయితే 2008లో కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు అధికారంగా క్షమాపణలు చెప్పింది. అయితే బ్రిటీష్‌ కొలంబియా కార్యాలయంతో కలిసి దర్యాప్తు కొనసాగుతుందని, లభ్యమైన అవశేషాలు భద్రపరుస్తామని అధికారులు తెలిపారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad