Trending

6/trending/recent

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా ఉన్నాయి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 24 గంటల వ్యవధిలో 91,120 కరోనా పరీక్షలు 18,285 పాజిటివ్ కేసులు న‌మోద‌యిన‌ట్లు ప్ర‌భుత్వం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. కొత్త‌గా వైర‌స్ కార‌ణంగా 99 మంది మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 24,105 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 1,92,104 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ సర్కార్ వెల్ల‌డించింది. కరోనాతో బాధపడుతూ ఇప్పటివరకూ 10,427మంది మృతి చెందారు. కొత్త‌గా న‌మోదైన మ‌ర‌ణాలను ప‌రిశీలిస్తే.. అత్యధికంగా వైర‌స్ కార‌ణంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి 14, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, నెల్లూరు 8, ప్రకాశం 8, విశాఖపట్నం 8, కర్నూలు 6, గుంటూరు 5, కృష్ణా 5, శ్రీకాకుళంలో ఐదుగురు క‌రోనాకు బ‌ల‌య్యారు

కరోనా సహాయ సమాచారం ఇలా

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయం డి.

● స్మా ర్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు .

● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు .

https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు .

● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.

క్రింద లింక్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోని, రాష్ట్రంలో కోవిడ్ సమాచారం తెలుసుకోవ‌చ్చు.

https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad