Trending

6/trending/recent

Andhra Pradesh: ఈ నెల 30 వరకు ఆఫీసుకు సెలువులు. స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

 కరోనా సెకెండ్ వేవ్ ఎవర్నీ వదలడం లేదు. రెట్టిపు వేగంతో ఏపీపై పంజా విసురుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో లాక్ డౌన్ తప్పని సరి పరిస్థితి నెలకొంది. తాజాగా డిప్యూటీ సీఎం దర్మాన ఆపీసులకు సెలవు ప్రకటించారు. ఈ నెల 30 వరకు ఆయన సెలవులు ప్రకటించారు

ఏపీలో కోరోనా విజృంభ‌ణకు బ్రేకులు పడడం లేదు. రోజు రోజకూ కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ప్రజల నుంచి లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వ్యాపారులు స్వచ్చంధంగా తమ వ్యాపారాలు మూసేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటి సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు ఈ నెల 30 వరకు సెలవు ప్రకటించారు.

ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రం హోంకు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సచివాలయంలో ఉద్యోగుల కరోనా మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైసు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినా కరనో కట్టడి సంగతి పక్కన పెడితే కేసులు రెట్టింపు అవుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో ఏపీలో రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. సామన్యూలను, ఉద్యోగులను, విద్యార్థులును, రాజకీయ నాయకులును, పెద్దలను, పిల్లలను ఎవరినీ వదలడం లేదు కరోనా.. క‌రోనా ఎఫెక్ట్‌తో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజాగా డిప్యూటీ సీఎం అధికారికంగా సెల‌వు ప్ర‌క‌టించారు. శ్రీకాకుళంలోని త‌న క్యాంపు కార్యాల‌యం, పార్టీ ఆఫీసులకు ఈ నెల 30వ తేదీవరకూ సెలవు ప్రకటించారు ధ‌ర్మాన కృష్ణ‌దాసు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పారు అయన.

ప్రజలు , కార్యకర్తలు , అభిమానులెవరూ క్యాంపు కార్యాలయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.. అత్యవసరమైతే క్యాంపు కార్యాలయ సిబ్బందిని ఫోన్ లో సంప్రదించాలని కోరారు డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు.

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు 70,414 కు చేరుకున్నాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 55423గా ఉండ‌గా.. 397 మంది కోవిడ్ బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు.. ప్ర‌స్తుతం 14,991 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం 11,780 మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతుండ‌గా.. 1,018 మంది కోవిడ్ కేర్ సెంటర్ లో.. 1671 మంది ఆస్ప‌త్రుల్లో ఉన్నార‌ని అధికారులు చెబుతున్నారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలోనూ త‌న క్యాంపు కార్యాల‌యానికి డిప్యూటీ సీఎం కృష్ణ‌దాసు సెల‌వు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పటికే శ్రీకాకుళం పట్టణంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మరోవైపు మధ్యాహ్నం రెండు గంటలకే అన్ని షాపులు మూసేస్తున్నారు. అత్యవసరం ఉన్నవారినే రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. లేదంటే పోలీసులు తిరిగి ఇంటికి పంపిస్తున్నారు.

ఒకప్పుడు గ్రీన్ జోన్ గా ఉన్న శ్రీకాకుళం ఇప్పుడు గజగజా వణుకుతోంది రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రతి రోజూ దాదాపు 1500లకు అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, పలసా, కాశీబుగ్గ లాంటి పట్టణాల్లో భారీగా కేసులు వస్తున్నాయి. దీంతో శ్రీకాకుళంలో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. షాపులను రెండు గంటలకే మూసేస్తున్నారు. అయినా కరోనా కట్టడి అవ్వడం లేదు. దీంతో డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 30 వరకు క్యాంప్ కార్యాలయానికి సెలవు ప్రకటించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad