Trending

6/trending/recent

Sunflower Seeds: పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తినండి.. 21 ఆరోగ్య ప్రయోజనాలు

Sunflower Seeds: స్కిన్, హెయిర్, హెల్త్‌కి సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎంతో మేలు చేస్తున్నాయి. ఇంకా వాటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పూర్తి వివరాల్ని ఫటాఫట్ తెలుసుకుందాం.

సరదాగా స్నాక్స్ తినాలంటే... మంచింగ్ కోసం ఈమధ్యకాలంలో ఎక్కువ మంది తింటున్నవి పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలే. ఎందుకంటే ఇవి ఇస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాస్త తియ్యగా, పప్పు పదార్థంతో ఉండే సీడ్స్... స్నాక్స్‌గా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాయి. వాటి టేస్ట్ ఎంతో మందికి నచ్చుతోంది. కేలరీలతోపాటూ... ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి.

ఈ విత్తనాల్ని పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో నుంచీ సేకరిస్తారు. ఇవి బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి. నీటి బిందువు ఆకారంలో కనిపిస్తాయి. సైంటిఫిక్‌గా మూడు రకాల సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అవి లైనోలెయిక్, హైలీ ఒలెయిక్, న్యూసన్. విత్తనాల్లోని మోనోశాచురేటెడ్, శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆధారంగా వాటిని విభజించారు. పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలతో 21 ప్రయోజనాలు తెలుసుకుందాం.

1. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సీ... గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక విటమిన్ ఈ... ఫ్రీ రాడికల్స్ నుంచీ కాపాడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. రోజూ ఓ పావు కప్పు గింజలు తింటే మనకు కావాల్సిన విటమిన్ Eలో 90 శాతం లభించినట్లే.

2. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. వీటిలో ఫైబర్... కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది.

3. జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ మల బద్ధకాన్ని నివారిస్తుంది.

4. కాన్సర్‌ను అడ్డుకుంటాయి. ఈ విత్తనాల్లోని విటమిన్ E, సెలెనియం, కాపర్‌కి విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉంది. ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. కొలన్ కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ సోకకుండా చేస్తాయి.

5. ఎముకలకు పుష్టి. ఈ విత్తనాల్లోని మెగ్నీషియం... ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది.

6. నరాలకు మేలు. సన్ ఫ్లవర్ విత్తనాల్లోని మెగ్నీషియం మన నరాలకు రిలాక్స్ ఇస్తుంది.

7. మెంటల్ హెల్త్. మన మూడ్‌ పాజిటివ్‌గా ఉండేలా చేస్తాయి ఈ విత్తనాలు. ఒత్తిడి తగ్గిస్తాయి.

8. విటమిన్ E కారణంగా... ఈ విత్తనాలు తింటే... శరీరంలో మంటలు, వాపుల వంటివి తగ్గుతాయి.

9. శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఈ విత్తనాల్లోని విటమిన్ E కాపాడుతుంది. డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది.

10. మంచి రుచి. ఈ విత్తనాలను యోగర్ట్, రైస్, పాస్తా, శాండ్‌విచ్‌లలో వాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

11. హైబీపీ కంట్రోల్ అవుతుంది. ఇందుకు కూడా విటమిన్ E ఉపయోగపడుతుంది.

12. శ్వాస తీసుకోవడం తేలిక. ఆయుర్వేదంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. సన్‌ఫ్లవర్ సీడ్స్... మన ఊపిరి తిత్తులను బాగు చేస్తాయి. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడూ ఎదురయ్యే సమస్యల్ని నయం చేస్తాయి.

13. శరీర ద్రవాలు బ్యాలెన్సింగ్‌తో ఉండేలా ఈ విత్తనాల్లోని పొటాషియం చూసుకుంటుంది. అలాగే అమీనో యాసిడ్... ఒత్తిడిని తగ్గించే సెరెటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

14. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచీ పిల్లల్ని కాపాడేందుకు ఈ సీడ్స్ ఉపయోగపడతాయి.

15. కీళ్ల నొప్పుల్ని నివారించడంలో కూడా ఈ పప్పులు బాగా పనిచేస్తాయి. ఈ విషయం పరిశోధనల్లో స్పష్టంగా తెలిసింది.

16. ఆస్తమాను నివారించడంలో ఇవి ఉపయోగపడతాయి. ముక్కు గడ్డకట్టకుండా చేస్తాయి. జలుపు, దగ్గును తగ్గిస్తాయి.

17. కళ్లకు మేలు. ఈ విత్తనాల్లోని ఆయిల్‌లో విటమిన్ ఏ ఉంటుంది. అది కంటి చూపును మెరుగు పరుస్తుంది.

18. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఈ గింజల్లో కావాల్సినంత జింక్ ఉంటుంది. ఇది గాయాల్ని తగ్గిస్తుంది. విటమిన్ E కూడా ఈ మేలు చేస్తుంది.

19. స్కిన్‌కి రక్షణ. ఈ విత్తనాల్లోని రాగి... మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాపర్ మన శరీరానికి కావాల్సిన మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

20. ముసలితనం రాకుండా చెయ్యడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు... మన చర్మానికి అత్యంత ప్రయోజన కారకాలు. ముఖ్యంగా విటమిన్ E స్కిన్ డ్యామేజ్ నుంచీ కాపాడుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

21. జుట్టుకు అవసరం. మన వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని జుట్టు కోరుకుంటుంది. ఈ గింజలు తిని మనం వాటిని అందించవచ్చు. ఫలితంగా జుట్టు బాగా పెరిగి... హెయిర్ లాస్ అరికట్టవచ్చు. జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అవుతాయి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad