Trending

6/trending/recent

MDM Stock Instructions: స్కూల్స్ లో మిగిలి ఉన్న గుడ్లు, చిక్కీలు, బియ్యం నిల్వలకు సంబంధించిన సూచనలు విడుదల

 న్యూస్ టోన్, అమరావతి: కరోనా కారణంగా ఈ నెల 20వ తేదీ నుండి 1 నుండి 9 తరగతుల వరకు విద్యా సంవత్సరం రద్దు చేసి స్కూల్స్ ను మూసివేసిన సంగతి తెలిసినదే. కానీ 19వ తేదీ నాటికి స్కూల్స్ లో గుడ్లు, చిక్కీలు, బియ్యం నిల్వలు మిగిలి ఉన్నాయి. వీటి తదుపరి వినియోగం పై విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం స్కూల్ లో మిగిలి ఉన్న గుడ్లు, చిక్కీలు, బియ్యం నిల్వలను ముందుగా లెక్క కట్టాలి. వీటిని ఆ స్కూల్ యొక్క రోల్ తో భాగించి సమ భాగాలుగా వచ్చే విధంగా విద్యార్థులకు పంపిణీ చేయాలి. ఒక వేళ తక్కువ స్టాక్ ఉన్నట్లయితే చిన్న తరగతుల విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చి వారికి పంపిణీ చేయాలి అని మిడ్ డే మీల్, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ శ్రీ దివాన్ మైదీన్ ఉత్తర్వులు ఇచ్చారు.

ఉదాహరణకు ఒక స్కూల్ రోలు 40 గా ఉండి, 100 కేజీల బియ్యం నిల్వ ఉంటే 100/40=2.5 ఒక్కో విద్యార్థికి రెండున్నర కేజీల బియ్యం ఇవ్వాలి.

ఉదాహరణకు ఒక స్కూల్ రోలు 40 గా ఉండి, 100 కేజీల గుడ్లు నిల్వ ఉంటే 100/40=2.5 ఒక్కో విద్యార్థికి  లెక్క ప్రకారం రెండున్నర గుడ్లు ఇవ్వాలి. గుడ్లు ఇలా ఇవ్వడం సాధ్యపడదు కావున, ఉత్తర్వులలో చిన్న తరగతులకు ప్రాధాన్యత ఇవ్వమని తెలిపి ఉన్నారు కావున ఒక్కో విద్యార్థికి రెండు గుడ్లు చోప్పున ఇచ్చి మిగిలిన వాటిని చిన్న తరగతుల విద్యార్థులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. చిక్కీలకు కూడా ఇదే విధంగా చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం పంపిణీ కి సంబంధించిన వివరాలను రిజిష్టర్ లో నమోదు చేసుకోవాలి.

ఉత్తర్వుల కాపీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad