Trending

6/trending/recent

HP Laptop: రూ.22 వేలలోపే టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్.. లాంచ్ చేసిన హెచ్‌పీ.. ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్!

హెచ్‌పీ మనదేశంలో విద్యార్థుల కోసం కొత్త ల్యాప్ టాప్ లాంచ్ చేసింది. అదే హెచ్‌పీ క్రోమ్‌బుక్ 11ఏ. ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యే రెండో తరగతి నుంచి ఏడో తరగతి మధ్య విద్యార్థులే లక్ష్యంగా ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేశారు.

ప్రధానాంశాలు:

  • ధర రూ.21,999గా నిర్ణయించిన హెచ్‌పీ
  • ఆన్ లైన్ క్లాసులకు వెళ్లే విద్యార్థులే లక్ష్యం
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్‌పీ తన కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. అదే హెచ్‌పీ క్రోమ్‌బుక్ 11ఏ. ఇందులో మీడియాటెక్ ఎంటీ8183 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. దీని బరువు కేవలం 1 కేజీ మాత్రమే ఉంది. ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే రెండో తరగతి నుంచి ఏడో తరగతి మధ్య విద్యార్థులే లక్ష్యంగా ఈ ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ లాంచ్ చేసింది.

హెచ్‌పీ క్రోమ్‌బుక్ 11ఏ ధర

దీని ధరను రూ.21,990గా నిర్ణయించారు. కేవలం ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్ మాత్రమే ఇందులో అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఒక సంవత్సరం గూగుల్ వన్ మెంబర్ షిప్ కూడా దీని ద్వారా లభించనుంది. 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా దీని ద్వారా అందించనున్నారు.

హెచ్‌పీ క్రోమ్‌బుక్ 11ఏ స్పెసిఫికేషన్లు

ఇందులో 11.6 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ టచ్ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌గా ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 73.8 శాతంగా ఉంది. మీడియాటెక్ ఎంటీ8183 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 256 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. దీంతోపాటు గూగుల్ వన్ ద్వారా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభించనుంది.

ఈ ల్యాప్‌టాప్ క్రోమ్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. గూగుల్ ప్లే స్టోర్ యాప్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. హెచ్‌పీ క్రోమ్‌బుక్ 11ఏ బరువు కేవలం 1.05 కేజీలుగా ఉంది. 37 WHr లిథియం అయాన్ పాలీమర్ బ్యాటరీని ఇందులో అందించారు. 16 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ల్యాప్ టాప్ అందిస్తుందని కంపెనీ అంటోంది.

యూఎస్‌బీ టైప్-ఏ పోర్టు, టైప్-సీ పోర్టులను ఇందులో అందించారు. దీంతోపాటు ఆడియో జాక్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ 5.0, వైఫై 5, కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ ల్యాప్ టాప్ పొడవు 28.5 సెంటీమీటర్లుగానూ, వెడల్పు 19.2 సెంటీమీటర్లుగానూ, మందం 1.68 సెంటీమీటర్లుగానూ ఉంది. హెచ్‌పీ ట్రూవిజన్ హెచ్‌డీ వెబ్‌క్యాం, బిల్ట్-ఇన్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, ఒక సంవత్సరం గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ అందించారు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad