Trending

6/trending/recent

Curfew Update: ఏపీలో వచ్చే వారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ...పాఠశాలల మూసివేత ?

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా ఆరు వేలకేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ పెట్టే ఆలోచన చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే... కరోనా కేసులను అరికట్టవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. లాక్ డౌన్ లో అమలు చేసిన కఠిన నిబంధనలను అమలు చేయాలనీ జగన్ సర్కార్ యోచిస్తోంది. అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల మూసివేతపై కూడానిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అటు పదో తరగతి పరీక్షలను రద్దు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది జగన్ ప్రభుత్వం. అయితే జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad