Trending

6/trending/recent

Corona Treatment: ఈ లక్షణాలుంటే... ఫలితం కోసం చూడకుండా...

Corona Treatment: కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని దేశం విలవిలలాడుతోంది. కరోనా కేసులు రోజు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు చేసి ఆ రిపోర్ట్ వచ్చే సరికి ఆలస్యం అవుతున్నది. అదే విధంగా, ర్యాపిడ్ టెస్టుల తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేస్తున్నారు. ఈ టెస్టుల ఫలితాలు రావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ఈలోపు కరోనా లక్షణాలు ఉంటె అవి ఇతరులకు వ్యాపించడం, లేదా తీవ్రత అధికమయ్యి ఊపిరితిత్తులు వ్యాపించి మరణాలు సంభవించడం జరుగుతున్నది. దీంతో కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం గొంతునొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే టెస్టుల రిజల్ట్స్ కోసం ఆగకుండా వెంటనే చికిత్స మొదలు పెట్టాలని కేంద్రం సూచించింది. ఫలితంగా మరణాల రేటును తగ్గించవచ్చని కేంద్రం చెప్తున్నది. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండాలని, ఏ మాత్రం విషమించినా వెంటనే ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించాలని కేంద్రం సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి, కరోనా లక్షణాలు కనిపిస్తే దానిని కరోనాగా భావించి చికిత్స అందించాలని కేంద్రం పేర్కొన్నది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad