Trending

6/trending/recent

SBI PO Recruitment 2021: పీఓ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసిన ఎస్‌బీఐ.. ఇలా చెక్‌ చేసుకోండి..

SBI PO Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ నియామకల కోసం ఈ ఏడాది జనవరి 6న పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను ఎస్‌బీఐ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ www.sbi.co.inలో చూసుకోవచ్చని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2000 పీఓ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. తుది ఫలితాలకు సంబంధించిన అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను ఎస్‌బీఐ విడుదల చేసింది. అలాగే ఎంపికైన అభ్యర్తుల మెయిన్స్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇలా చెక్‌ చేసుకోండి..

* మొదట ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ SBi on sbi.co.inలోకి వెళ్లాలి.

* అనంతరం ‘Careers section’ సెక్షన్‌లోకి వెళ్లాలి.

* తర్వాత ‘RECRUITMENT OF PROBATIONARY OFFICERS (Advertisement No. CRPD/ PO/ 2020-21/ 12)’ లింక్‌ కింద ఉన్న ‘Final Result’ను క్లిక్‌ చేయాలి.

* వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాకు సంబంధించి పీడీఎఫ్‌ ఫార్మట్‌లో ఉన్న ఫైల్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో మీ రూల్‌ నెంబర్‌ ఉందో లేదో చెక్‌ చేసుకుంటే సరిపోతుంది.


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad