Trending

6/trending/recent

COVID-19: కోవిడ్ నిబంధనలు.. ఏపీ సర్కార్ కొత్త ఆదేశాలు

భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్ పెరుగుతూ వస్తున్నాయి... దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేసే విషయంపై సీరియస్‌గా దృష్టిసారించింది.. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత మేర వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. 

రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు వైరస్ రహితంగా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం... శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాల్సిందిగా స్పష్టం చేసింది.. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ చేయాల్సిందిగా సూచనలు చేసింది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని స్పష్టంగా తెలిపింది. డైనింగ్ హాళ్లు, క్యాంటీన్లలో ప్రతీ రెండు గంటలకూ శానిటేషన్ చేయాల్సిందిగా ఆదేశించిన సర్కార్.. ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. 


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad