Trending

6/trending/recent

ఏయూ దూర విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 27: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా యుజీ, పీజీ, డిప్లమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిందని సీఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరభద్రరావు, ఏయూ అసిస్టెంట్ కో ఆర్డినేటర్ ఎం.విన్సెంట్ పాల్ తెలిపారు. కోర్సుకు సంబంధించిన ఫీజులను 'రిజి స్టార్, ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖపట్నం' పేరున ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డీడీ ద్వారా చెల్లించాలన్నారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా డిసెంబరు 31వ తేదీ వరకు, రూ.200 పెనాల్టీతో వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు గడువు ఉందన్నారు. కోర్సులకు సంబంధించిన దరఖాస్తులను కళా శాల ప్రాంగణంలోని ఏయూ స్టడీ సెంటర్ నుంచి పొందాలని, వివరాలకు ఫోన్ నెంబర్ 08812-251645లో సంప్రదించాలన్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad