Trending

6/trending/recent

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. వివరాలు ఇవిగో!

 Bank Holidays in March 2023: మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూత పడనున్నాయి. 

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. వివరాలు ఇవిగో!

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. వివరాలు ఇవిగో!

మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూత పడనున్నాయి. మీకు బ్యాంక్ పనులు ఉన్నట్లయితే.. ఆ సెలవుల జాబితా ఏంటో తెలుసుకుని.. ముందస్తుగా ప్లాన్ సిద్దం చేసుకోండి. అప్పుడు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు పూర్తవుతాయి. 

ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారాలు రెండు ఉండగా.. మరో ఆరు పండుగ రోజులు వచ్చాయి. 

వెరిసి మార్చి నెలలో మొత్తంగా 12 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా ఉండనున్నాయి. ఆ లిస్టు ఏంటో తెలుసుకుందామా.. 

జాతీయ సెలవులు లిస్టు ఇలా: 

మార్చి 5: ఆదివారం, మార్చి 11: రెండో శ‌నివారం, మార్చి 12: ఆదివారం, మార్చి 19: ఆదివారం, మార్చి 25: నాలుగో శనివారం, మార్చి 26: ఆదివారం

పండుగ సెలవులు ఇలా: 

మార్చి 3 శుక్రవారం(చుప్‌చార్ కుట్‌-త్రిపుర రాజ‌ధాని అగ‌ర్తల‌లో సెల‌వు), మార్చి 7: మంగ‌ళ‌వారం(హోలీ - బెలాపూర్‌, గువాహ‌టి, తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌, డెహ్రడూన్‌, జైపూర్‌, జ‌మ్ము, కాన్పూర్‌, కోల్‌క‌తా, ల‌క్నో,ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, రాంచీ, శ్రీన‌గ‌ర్‌ల‌లో సెల‌వు), మార్చి 8: బుధ‌వారం(హోలీ -అగ‌ర్తల‌, ఐజ్వాల్‌, అహ్మదాబాద్‌, భోపాల్‌, భువ‌నేశ్వర్‌, ఛండీగ‌ఢ్‌, గ్యాంగ్‌ట‌క్‌, ఇంపాల్‌, కాన్పూర్‌, ల‌క్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లాల్లో సెల‌వు), మార్చి 9: గురువారం(హోలీ – పాట్నా), మార్చి 22: బుధ‌వారం(తెలుగు సంవ‌త్సరాది, ఉగాది, బీహార్ దివ‌స్‌), మార్చి 30: గురువారం- శ్రీ‌రామ‌న‌వ‌మి


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad