Trending

6/trending/recent

Warren Buffett : సక్సెస్‌ అంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కాదంటున్న అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌

Warren Buffett : ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ సక్సెస్‌కి విభిన్నమైన నిర్వచనం ఇచ్చారు. ఆయన ఈసీవోగా ఉ‍న్న బెర్క్‌షేర్‌ హత్‌వే కంపెనీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్ని అనేక అంశాలను ప్రస్తావించారు. 

Warren Buffett : సక్సెస్‌ అంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కాదంటున్న అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌

కోవిడ్‌ వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఉత్సవాలను వర్చువల్‌గా కాకుండా నేరుగా నిర్వహించారు. 116 బిలియన్ల సంపదతో ప్రపంచం కుబేరుల్లో టాప్‌లెన్‌లో ఉన్న వారెన్‌ బఫెట్‌ సక్సెస్‌ని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా వారెన్‌ బఫెట్‌ మాట్లాడుతూ..  సక్సెక్‌కు నిర్వచనం ఇవ్వాలంటే జీవితాన్ని చూడాలి. మీరు నా వయసుకు  వచ్చినప్పుడు (91) జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సక్సెస్‌ అనేది బ్యాంక్‌ బ్యాలెన్స్‌, మన పరపతిలలో ఉండదు. మనల్ని ఎంత మంది ప్రేమించాలని మనం కోరుకుంటాం.. వాస్తవంలో మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు ఎందురు ఉన్నారనేది సక్సెస్‌కి అసలైన నిర్వచనం అని బఫెట్‌ అన్నారు.

విచిత్రం ఏంటంటే ప్రేమను మనం డబ్బుతో కొనలేం. బిలియన్‌ డాలర్ల డబ్బు ఉంది కదా భారీ ఎత్తున ప్రేమను పొందగలం అనుకోవడం పొరపాటు. అది అసాధ్యం కూడా. కేవలం మనం ఇతరుల్ని ప్రేమించినప్పుడే.. ఆ ప్రేమ మనకు తిరిగి వస్తుంది అంటూ జీవిత సారాన్ని కాచి వడబోసిన విషయాలను వారెన్‌ బఫెట్‌ నేటి తరానికి వివరించారు. అసలైన ప్రేమను పొందడమే జీవితంలో సక్సెస్‌కు నిజమైన కొలమానం అన్నారు.

Warren Buffett : సక్సెస్‌ అంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కాదంటున్న అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad