Trending

6/trending/recent

AP – Telangana: డేంజర్‌లో ఏపీ, తెలంగాణ ప్రజలు.. భారత వాతావరణ శాఖ వార్నింగ్‌

ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు టెంపరేచర్స్‌ రికార్డవుతున్నాయ్‌. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్‌.

AP – Telangana: డేంజర్‌లో ఏపీ, తెలంగాణ ప్రజలు.. భారత వాతావరణ శాఖ వార్నింగ్‌

Heatwaves: ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త.! ఉదయం పది దాటాక ఇంటి నుంచి కాలు బయటపెడ్తున్నారా?! అయితే, మీ ప్రాణాలకు మీరే బాధ్యులు. ఎందుకంటే AP, తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు డేంజర్‌లో ఉన్నారు. అవును, ఇది నిజం. ఇది మేం చెబుతోన్న మాట కాదు. స్వయంగా భారత వాతావరణశాఖ చేస్తోన్న వార్నింగ్‌. తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అండ్‌ రెడ్‌ వార్నింగ్‌ కంటిన్యూ అవుతోంది. అత్యవసరమైతే తప్ప, మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెబుతోంది IMD. ఏపీ, తెలంగాణ… రెండు రాష్ట్రాల్లోనూ భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటలకే నిప్పులు కక్కుతున్నాడు. మార్నింగ్‌ పది దాటిందంటే చాలు నడినెత్తిన మంట పెట్టినట్టు పొగలు రేపుతున్నాడు.

టెంపరేచర్స్‌కి తోడు, హీట్‌ వేవ్‌ కూడా ఊహించని స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తోంది IMD. ఇప్పుడున్న టెంపరేచర్స్‌ శాంపిల్స్‌ మాత్రమేనని, ముందుముందు ఇంకా పెరుగుతాయంటోంది. మే నెల్లోకి ఎంటర్‌ కావడంతో ఇక నిప్పుల కుంపటేనని హెచ్చరిస్తోంది. రాత్రుళ్లు సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని బాంబు పేల్చింది IMD. ఏపీ, తెలంగాణ… రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు టెంపరేచర్స్‌ రికార్డవుతున్నాయ్‌. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్‌. ఆదిలాబాద్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, రామగుండంలో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్‌ రికార్డవుతున్నాయ్‌. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో అల్లాడిపోతున్నారు హైదరాబాదీలు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టెంపరేచర్స్‌ 43 డిగ్రీలు దాటుతున్నాయ్‌. ఉదయం 8గంటలకే వేడి గాలులు బెంబేలెత్తిస్తున్నాయ్‌. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అయితే ఉడికిపోతుంది. జిల్లాలో రికార్డు టెంపరేచర్స్ రికార్డవుతున్నాయ్‌. భానుడి ప్రతాపానికి ప్రజలు ప్రాణాలు వదిలేస్తున్నారు. తిరుమలలో కూడా ఎండలు మండిపోతున్నాయ్‌. దాంతో భక్తుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది టీటీడీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం భానుడి భగభగలతో మండిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు రేంజ్‌లో టెంపరేచర్స్‌ రికార్డవుతున్నాయ్‌. ఉత్తరాది రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ మార్క్‌కు చేరాయి ఉష్ణోగ్రతలు. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ కంటిన్యూ అవుతోంది.

AP – Telangana: డేంజర్‌లో ఏపీ, తెలంగాణ ప్రజలు.. భారత వాతావరణ శాఖ వార్నింగ్‌

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad