Trending

6/trending/recent

World Book Day: నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం.. ఒక పుస్తకం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?

 World Book Day: 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు కందుకూరి వీరేశలింగం.

World Book Day: నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం.. ఒక పుస్తకం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా.. ?

World Book Day: ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక పుస్తకానికి ఉండే విలువ అలాంటిది మరి. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఒక పుస్తకం చదవడం వల్ల మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం రావడమే కాకుండా నడవడిక కూడా అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని అనేక పరిశోధనలలో తేలింది. కొంతమంది దృష్టిలో పుస్తకం చదవడం ఒక రకమైన కంఫర్ట్. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా తమ స్నేహితుడిని (పుస్తకాన్ని) తీసుకువెళతారు. పుస్తక పఠనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పటికీ పుస్తకం చదవకుండా రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరికొన్ని తెలుసుకుందాం.

1. ఒత్తిడి దూరం

నేటి కాలంలో దాదాపు చాలామంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. పనిభారం, కుటుంబ సమస్యల వల్ల వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు పుస్తక సహాయం తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నప్పటికీ పుస్తకం మీకు సులువుగా లభిస్తుంది. ఇది మీకు ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.

2. బాగా నిద్రపోండి

బిజీ షెడ్యూల్, ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వారికి తగినంత నిద్ర రాదు. దీనివల్ల కలిగే అలసట అతని పని మీద కనిపిస్తుంది. అందుకే పడుకునే ముందు పుస్తకం చదవడం మంచిది. దీనివల్ల ఆటోమేటిక్‌గా నిద్ర వస్తుంది. చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. వారు పుస్తకంలోని కొన్ని పేజీలు చదివే వరకు అస్సలు నిద్రపోరు.

3. నరాలను రిలాక్స్ చేస్తుంది

ఒక పుస్తకం ప్రశాంతంగా చదివితే నరాలు మొత్తం రిలాక్స్‌ అవుతాయి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది ఆఫీసు లేదా ఇంటి పనుల వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదువుతారు. నిత్యం పుస్తకాన్ని చదవడం వల్ల గుండె వేగం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

4. పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి

పుస్తకాన్ని చదవడం కనుక అస్వాదించగలిగితే దాన్ని మించిన తృప్తి మరొకటి ఇవ్వదు. పుస్తకం అమ్మ వలే లాలిస్తుంది. నాన్న వలే ఆదరిస్తుంది. గురువులా బోధిస్తుంది. మార్గదర్శి అవుతుంది. ఒంటరితనంలో స్నేహితుడై ఓదార్పునిస్తుంది. ప్రియురాలై అక్కున చేర్చుకుంటుంది. ‘పుస్తకాలు దీపాలవంటివి. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది’ అంటారు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
World Book Day: నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం.. ఒక పుస్తకం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad