Just In

6/trending/recent

Ads Area

Vitamin C: ఈ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సి పుష్కలం.. మహిళలు కచ్చితంగా తినాల్సిందే..!

 Vitamin C: మహిళలు చాలామంది అనారోగ్యంతో బాధపడుతుంటారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే. వీరు విటమిన్‌ సి ఉన్న ఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.

Vitamin C: ఈ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సి పుష్కలం.. మహిళలు కచ్చితంగా తినాల్సిందే..!

Vitamin C: మహిళలు చాలామంది అనారోగ్యంతో బాధపడుతుంటారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే. వీరు విటమిన్‌ సి ఉన్న ఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తింటే చర్మ సమస్య , రక్తస్రావం, జుట్టు రాలడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మీరు ఉదయాన్నే ఒక విటమిన్ సి సప్లిమెంట్ తీసుకుంటే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి ఇది మీ మొత్తం శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. విటమిన్ సి శరీరానికి చాలా అవసరం ఎందుకంటే ఇది మన శరీరంలోని కణజాలాలను రిపేర్ చేస్తుంది. దీనివల్ల చర్మం మెరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఏ పండ్లలో ఎక్కువగా లభిస్తుందో తెలుసుకుందాం.

1 ఉసిరి

మీ జుట్టు రాలుతున్నట్లయితే ప్రతిరోజూ ఉసిరికాయ తినాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును బలంగా చేస్తుంది. ఉసిరి బాగా తురుముకొని దానికి కొంచెం నీరు కలిపి రాత్రంతా నానబెట్టి, ఉదయం వడగట్టి తాగాలి. కొంచెం తేనె కలిపితే చాలా బాగుంటుంది.

2. మోసాంబి

మోసాంబి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీకు పేగు ఆరోగ్యం సరిగా లేనట్లయితే మోసంబి షాట్ మంచి ఉపశమనం ఇస్తుంది.

3. పైనాపిల్

ఎవరైనా ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే పైనాపిల్ తినాలి. విటమిన్ సి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వాపు, నొప్పిని వదిలించుకోవడానికి ఫైనాపిల్‌ తినవచ్చు.

4. మామిడికాయ

వేసవిలో కంటి ఇన్ఫెక్షన్‌ను తొలగించడానికి మామిడికాయను ఆహారంలో చేర్చుకోండి. మామిడిపండు విటమిన్ ఎ, సిలకు గొప్ప మూలం. ఇది మీ కళ్లకు చాలా మేలు చేస్తుంది. మీ కళ్లలోని కణజాలాలను సక్రియం చేయడంలో విటమిన్ సి సహాయపడుతుంది.

5. నిమ్మకాయ

మీరు బరువు తగ్గాలనుకుంటే నిమ్మకాయ డైట్‌లో చేర్చుకోవచ్చు. గోరువెచ్చని నీటితో లెమన్ జ్యూస్‌ కలిపి తీసుకుంటే చాలా మంచిది.

6. కివి పండు

మీ చర్మం మృదుత్వం, ఫ్లెక్సిబిలిటీ తగ్గుతున్నట్లయితే కివీ పండు తినాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

7 . స్ట్రాబెర్రీ

మీరు మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలనుకుంటే స్ట్రాబెర్రీ మీకు ఉత్తమమైనది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[post_ads]

Vitamin C: ఈ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సి పుష్కలం.. మహిళలు కచ్చితంగా తినాల్సిందే..!


Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information