Trending

6/trending/recent

Viral News: ఫస్ట్‌ క్లాస్ స్టూడెంట్ అల్లరి చేశాడంట..ప్రధానోపాధ్యాయురాలు చెప్పుతో కొట్టింది

Sangareddy: క్లాస్‌ రూమ్‌లో అల్లరి చేశాడని ఒకటవ తరగతి స్టూడెంట్‌పై తన ప్రతాపం చూపించింది ప్రధానోపాద్యాయురాలు. ఆరేళ్ల బాలుడ్ని చెప్పుతో కొట్టడమే కాకుండా తిట్టడంతో విద్యార్ధి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో హెడ్మాస్టర్ చేసిన నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్ది తల్లిదండ్రులు.

 Viral News: ఫస్ట్‌ క్లాస్ స్టూడెంట్ అల్లరి చేశాడంట..ప్రధానోపాధ్యాయురాలు చెప్పుతో కొట్టింది

పిల్లలు అంటేనే అల్లరి చేస్తారు. అల్లరి మాన్పించి వాళ్లకు విద్యా బుద్దులు చెప్పమని తల్లిదండ్రులు స్కూల్‌కి పంపుతారు. మరి అక్కడ పాఠాలు, విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు, ప్రధానోపాధ్యాయురాలు తమ కోపం, అసహనాన్ని పిల్లలపై ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ విద్యార్ది (First class student) ఎగ్జామ్ (Exam)సరిగా రాయలేదంట. అందుకని స్కూల్‌లో పెద్ద పంతులమ్మ ఆ పిల్లవాడ్ని చెప్పుతో కొట్టింది. ఉపాధ్యాయ వృత్తికి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం విమర్శలకు కారణమైంది. సంగారెడ్డి (Sangareddy)జిల్లాలోని ఆందోల్ (Andole)మండలం నేరడిగుంట (Neradigunta) గ్రామంలో ప్రైమరీ పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. ఒకటవ తరగతి చదువుతున్న బాలుడు తరగతి గదిలో అల్లరి చేస్తూ సరిగా పరీక్ష రాయడం లేదు. ఆ విషయం తెలుసుకున్న స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు (Headmistress పారిజాతం (Parijatam)కోపంతో బాలుడ్ని చెప్పు (Slaps)తో కొట్టింది. అల్లరి చేస్తున్న బాలుడ్ని కోపంతో తిట్టింది. విషయాన్ని బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పడు. దీంతో ప్రధానోపాధ్యయురాలు చేసిన నిర్వాకం అందరికి తెలిసిపోయింది. ఆ విధంగా ప్రవర్తించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్.

Viral News: ఫస్ట్‌ క్లాస్ స్టూడెంట్ అల్లరి చేశాడంట..ప్రధానోపాధ్యాయురాలు చెప్పుతో కొట్టింది

చిన్న పొరపాటుకు అంత పనిష్మెంటా..

స్కూల్‌కి వెళ్లి ఎందుకు కొట్టారని బాలుడి తల్లిదండ్రులు నిలదీయడంతో తాను చేసింది తప్పేనని అంగీకరించారు హెడ్మాస్టర్ పారిజాతం. ఇకపై అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని క్షమాపణ కోరింది. ప్రధానోపాధ్యురాలు సారీ చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు వెనక్కి తగ్గారు. పసివాడు పరీక్ష రాయకుండా అల్లరి చేస్తే ఓ ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్న విద్యావంతురాలు విచక్షణ కోల్పోయి చెప్పుతో కొట్టడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టవద్దని ఎంఈవోకి ఫిర్యాదు చేయమని పట్టుబట్టడంతో కంప్లైంట్ చేశారు బాలుడి తల్లిదండ్రులు.

ప్రధానోపాధ్యురాలిపై విమర్శలు..

ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ పట్ల స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు పారిజాతం చెప్పుతో కొట్టిన విషయాన్ని ఆందోల్ మండల విద్యాశాఖాధికారి కృష్ణకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. అతను కూడా సీరియస్‌గా తీసుకోకపోవడంతో స్థానికులు, విద్యార్ధుల తల్లిదండ్రులు కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్‌కి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పారు. ప్రధానోపాద్యాయురాలిపై కంప్లైంట్ చేశారు. పవిత్రమైన విద్యాలయాల్లో ఇలాంటి మొండి, నిర్లక్ష్యపు ధోరణి కలిగిన వ్యక్తులు ఉపాధ్యాయులుగా ప్రదానోపద్యాయులుగా ఉండకూడదంటున్నారు స్థానికులు. తప్పు చేసిన వాళ్లను వెనకేసుకొని ఎంఈవో కృష్ణ లాంటి వాళ్లను సైతం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కఠినంగా శిక్ష విధిస్తేనే మరోసారి ఇలాంటివి పునరావృతం కావని సూచిస్తున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు.
 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad