Trending

6/trending/recent

Summer Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ నగరాల మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

 వేసవి ప్రారంభమవడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. తద్వారా బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది. ఈ రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే(SCR) అధికారులు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు.

Summer Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ నగరాల మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

వేసవి ప్రారంభమవడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. తద్వారా బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది. ఈ రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే(SCR) అధికారులు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. రద్దీ అధికంగా ఉండే కాకినాడ – సికింద్రాబాద్ మార్గంలో రైళ్లు నడపనున్నారు. విజయవాడ శాటిలైట్ స్టేషన్ రాయనపాడు మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్‌(Secunderabad) – కాకినాడ టౌన్‌(Kakinada Train) ప్రత్యేక రైలు (07193) 23 న రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, రేపు ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07194) 24వ తేదీ (రేపు) రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, మౌలాలీ స్టేషన్‌లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

[post_ads]
Summer Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ నగరాల మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad