Trending

6/trending/recent

Shani Amavasya 2022: ఏప్రిల్ 30 అతీంద్రియ శక్తులున్న అమావాస్య.. ఈరోజు కాకి లేదా కుక్కకు ఇది తినిపిస్తే ఎంతటి పేదవారైనా..

 Shani amavasya: శనివారం అమావాస్య తిథి కలిస్తే.. శనిఅమావాస్య అంటారు. ఈరోజు కాకి కనిపిస్తే.. ఏం చేయాలో తెలుసుకుందాం. దీనివల్ల శనిదోషం నుంచి విముక్తి కలిగించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. ఇది ఏడాదిలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుంది. శనిదేవుడికి ఈరోజు ఎంతో ప్రీతికరం. కాకి శనిదేవుడి వాహనం. మనకు సాధారణంగా కాకులు కనిపిస్తూనే ఉంటాయి.

Shani Amavasya 2022: ఏప్రిల్ 30 అతీంద్రియ శక్తులున్న అమావాస్య.. ఈరోజు కాకి లేదా కుక్కకు ఇది తినిపిస్తే ఎంతటి పేదవారైనా..

కాకికి మన దైనందిత జీవితంతో ముడిపడిఉంటుంది. కాకిని పితృదేవతలకు ప్రతీక అంటారు. కాకి అరుపునకు రామాయణంలో కూడా ఒక కథలో ప్రచారం ఉంది. లంకలో ఉన్న సీతమ్మ వద్దకు ఆంజనేయుడు వస్తున్నప్పుడు చెట్టుపై ఉన్న కాకి అరిచిందని అంటారు. అంతేకాదు, ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తే కదా. కాకి తలపై తన్నితే అశుభం అంటారు. కానీ, దీంతో భయపడాల్సిన అవసరం లేదు. స్నానం చేసుకుని ఏదైనా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం పెడితే సరిపోతుంది.

దోషం పూర్తిగా తొలగిపోతుంది. ఇంటి నుంచి మనం బయటకు వెళ్లినప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీకు విజయం సాధిస్తారని అర్థం. నిండుకుండపై కాకి వాలడాన్ని చూసినవారు వెంటనే ధనవంతులవుతారని జోతిషులు చెబుతున్నారు. కాకి మాంసం ముక్కను పట్టుకెళుతూ ఏదైనా వ్యక్తిపై పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని అంటారు.

కాకులన్ని ఒక సమూహంగా ఒక స్థలంలో కూర్చొని అరిస్తే.. ఆ స్థలం వ్యక్తికి ఆపదలు వస్తాయని నమ్ముతారు. కాకి మహిళ తలపై కూర్చుంటే తన భర్త సమస్యల్లో పడతాడని అంటారు. కాకిని ఆగ్నేయం పై అరిస్తే.. ధనలాభం. కాకి ఇంటి పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు బియ్యం గింజలు వేస్తే దరిద్రదేవత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. అలాగే శనిఅమావాస్యరోజు కూడా బియ్యం గింజలు వేస్తే దరిద్రదేవత ఎప్పుడూ ఇంటికి రాదు.

అలాగే శనిదేవుడు లక్షిదేవిని ఆ ఇంటికి పంపిస్తాడని నమ్మకం ఉంది. ఈ శని అమావాస్య రోజు ఏ సమయంలోనైనా కాకి కనిపిస్తే ఈ పని చేస్తే రాజయోగం కలుగుతుందని జోతిషులు చెబుతున్నారు. మీకు ఉండే శనిదోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా ఆహారం పెట్టాక శం శనైశ్చరాయ: నమ: అని పఠించడం. కుదిరితే నువ్వలతో చేసిన రొట్టెను కూడా పెట్టండి. గోచారరీత్యా శనిదోషం ఉన్నవారు ఇలా చేస్తే శనిదోషం తొలగిపోతుంది. ఈరోజు శనిని పూజిస్తే.. ఆయన చల్లని చూపులు మీపై ఉంటుంది. అంతేకాదు ఈరోజు పూర్తీకులకు తర్పణం సమర్పించాలి.

ఈరోజు కొన్ని ధార్మిక పనులు చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ శుభకృత సంవత్సరంలో ఈరోజు పూర్వీకులకు నీటిని సమర్పించాలి. అనారోగ్యం తొలగిపోయి, సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు దివ్యాంగులకు దానం చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఈరోజు రావిచెట్టును పూజిస్తే.. శనిదృష్టి నుంచి బయటపడతారు. మల్లెల నూనె, సింధూరంతో ఆంజనేయుడిని పూజించడం వల్ల కూడా శనిదోషం పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజున ఉదయాన్నే నీటిని పోసి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. రోటిలలో నల్ల నువ్వలు కలిపి నల్ల ఆవు, కాకి, నల్ల కుక్కలకు తినిపించాలి. దీనివల్ల కూడా శనిప్రభావం తగ్గిపోతుంది.

Shani Amavasya 2022: ఏప్రిల్ 30 అతీంద్రియ శక్తులున్న అమావాస్య.. ఈరోజు కాకి లేదా కుక్కకు ఇది తినిపిస్తే ఎంతటి పేదవారైనా..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad