Just In

6/trending/recent

Ads Area

PM Modi: కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రైతుల కోసం మరో ముందడుగు

PM Modi: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులు (Farmers) ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది.

PM Modi: కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రైతుల కోసం మరో ముందడుగు

PM Modi: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులు (Farmers) ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఇక తాజాగా మోడీ సర్కార్‌ (Modi Government) రైతుల కోసం మరో ముందడుగు వేసింది. ఏప్రిల్ 25 నుండి 30 వరకు వ్యవసాయానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. ‘కిసాన్‌ భగీదారీ ప్రాథమిక హమారీ’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీని కింద వ్యవసాయానికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో (KVK) వ్యవసాయ మేళా, సహజ వ్యవసాయంపై ఒక ప్రదర్శనను నిర్వహిస్తుంది. దేశంలో 720 కెవికెలు ఉన్నాయి. ఈ విధంగా రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రచారానికి డెయిరీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు కూడా సహకరిస్తాయని అధికారులు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రచారంలో హైలైట్ చేస్తారు. చాలా కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ‘క్రాప్ ఇన్సూరెన్స్ స్కూల్’ని కూడా ప్రారంభించనున్నారు.

ఐదు రోజుల్లో ఈ అంశాలపై చర్చ:

☛ హరిత విప్లవం: ఆహార ఉత్పత్తిలో స్వావలంబన.

☛ ఉద్యాన పంటల అతిపెద్ద ఉత్పత్తిదారు- అల్లం, అరటి, మామిడి, బొప్పాయిపై చర్చ.

☛ పసుపు పంట సాగుపై

☛ తేనె ఉత్పత్తి.

☛ పంటల నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడం గురించి.

☛ వ్యవసాయంలో రిమోట్ సెన్సింగ్, GIS, డ్రోన్స్, బయోటెక్నాలజీ.

☛ వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమం విజయవంతం.

☛ విత్తనాలు, ఎరువుల్లో స్వయం సమృద్ధి.

☛ వ్యవసాయ యాంత్రీకరణలో పురోగతి. సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (IPM).

[post_ads]

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి వ్యవసాయ-పర్యావరణ మరియు పశువుల పద్ధతులపై ఉపన్యాసాలు నిర్వహించబడతాయి. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి (ODOP)పై వెబ్‌నార్‌ను వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇందులో ఎంపిక చేసిన 75 మంది రైతులు, పారిశ్రామికవేత్తలతో జాతీయ స్వావలంబన భారత్ సదస్సును నిర్వహించనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ జిల్లా-ఒక ఉత్పత్తి ఆధారిత వర్క్‌షాప్, వెబ్‌నార్లు మరియు శాఖల వివిధ పథకాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వం సాధించిన విజయాలపై తెలియజేయనున్నారు. దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఈ మంత్రిత్వ శాఖల క్యాబినెట్, రాష్ట్ర మంత్రులతో సహా స్థానిక ప్రజా ప్రతినిధులు, కోటి మందికి పైగా రైతులు ఈ ప్రచారంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ ప్రధాన పథకాల కింద కార్యకలాపాలు, విజయాలు వివరించనున్నారు.

ఈ ప్రణాళికలపై దృష్టి :

☛ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.

☛ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన.

☛ ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన.

☛ ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన.

☛ కిసాన్ క్రెడిట్ కార్డ్. వ్యవసాయ రుణం.

☛ ఇ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (e-NAM).

☛ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO).

☛ సాయిల్ హెల్త్ కార్డ్.

☛ సేంద్రీయ, సహజ వ్యవసాయం.

☛ మొక్కల సంరక్షణ, మొక్కల నిర్బంధం.

☛ తేనెటీగల పెంపకం.

☛ వ్యవసాయ యాంత్రీకరణ.

☛ జాతీయ ఆహార భద్రతా మిషన్.

☛ విత్తనాలు, నాటడం.

☛ హార్టికల్చర్ సమగ్ర అభివృద్ధిపై మిషన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[post_ads]

PM Modi: కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రైతుల కోసం మరో ముందడుగు

Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information