Trending

6/trending/recent

Less AC Current Bill Tips : ఏసీ వాడుతున్నారా.. వేసవిలో కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఎయిర్ కండిషన్ (AC) కొనే ముందు.. అందరూ ముందుగా కరెంటు బిల్లు విషయం గురించే మదనపడుతుంటారు. కరెంటు రేట్లు పెరగడంతోపాటు బిల్లులు వాచిపోతున్నాయి.

Less AC Current Bill Tips : ఏసీ వాడుతున్నారా.. వేసవిలో కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఎయిర్ కండిషన్ (AC) కొనే ముందు.. అందరూ ముందుగా కరెంటు బిల్లు విషయం గురించే మదనపడుతుంటారు. కరెంటు రేట్లు పెరగడంతోపాటు బిల్లులు వాచిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏసీ కొనాలనుకునేవాళ్లు కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఏదో తంటాలు పడి ఏసీ కొందామని ట్రై చేద్దామనుకున్నా.. నెలనెలా పెద్ద డిజాస్టర్‌గా వచ్చే ఆ కరెంటు బిల్లు చూస్తే మాత్రం వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి సమయంలోనే తక్కువ కరెంట్‌తో నడిచే ఏసీల గురించి ఆరా తీస్తుంటారు. ఇదే క్రమంలో ఇన్వర్టర్ AC(Inverter AC) పేరు మొదట వినిపిస్తుంది. సాధారణంగా నాన్ ఇన్వర్ట్ AC(Normal AC)ని చూడటం లేదా ఉపయోగించడం అలవాటు చేసుకున్నాం. అయితే, ఎన్ని రకాలుగా చూసినా ఇన్వర్టర్ ఏసీ దాని కంటే మెరుగైనదే. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఖరీదుగా మారుతుంది.

అదేంటి ఇలా అంటున్నారని షాకవుతున్నారా.. అందుకే ముందుగా రెండు ఏసీల మధ్య తేడా తెలుసుకుందాం. ధరలో తేడా ఏంటో, ఇన్వర్టర్ ఏసీని ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నాన్ ఇన్వర్టర్ AC ఎల్లప్పుడూ సాధారణ వేగం, తక్కువ సామర్థ్యంతో నడుస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. దీనికి విరుద్ధంగా, ఇన్వర్టర్ AC వేగంలోనూ, సామర్థ్యంలోనూ భారీగా తేడాలు చూపిస్తుంది. గది చాలా చల్లగా ఉంటే, ఇన్వర్టర్ AC స్వయంగా సర్దుబాటు చేసుకుంటుంది. ఇది విద్యుత్తును ఆదా చేస్తుంది. దీంతో AC జీవితాన్ని కూడా పొడిగిస్తుంది. అయితే నాన్-ఇన్వర్టర్ ACలో ఈ ఫీచర్ లేదు.

ఇన్వర్టర్ AC- సాధారణ AC మధ్య వ్యత్యాసం..

వాస్తవానికి, ఇన్వర్టర్ ACలో కంప్రెసర్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఇది AC వేగాన్ని నియంత్రిస్తుంది. ఈ పని నాన్-ఇన్వర్టర్ ACలో ఉండదు. మీ గది చల్లబడిన తర్వాత, ఇన్వర్టర్ AC కంప్రెసర్ ఎయిర్ కండీషనర్ ఫ్యాన్, ఎయిర్ సప్లై వేగాన్ని తగ్గిస్తుంది. ఏసీ మోటారు నడుస్తూనే ఉన్నా.. కంప్రెసర్ ఆఫ్ చేయకయినా.. విద్యుత్తుపై ఎక్కువ లోడ్ పడదు. ఇటువంటి పరిస్థితిలో ఇన్వర్టర్ AC తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఇన్వర్టర్ ACలు వేరియబుల్ వేగంతో పనిచేసే DC కంప్రెషర్‌లతో అమర్చబడి ఉంటాయి. అంటే, మీకు ఎక్కువ చలి కావాలంటే, ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది. గది చల్లగా మారగానే, అది తక్కువ విద్యుత్తుతో నడుస్తుంది. కంప్రెసర్ మోటార్ తక్కువ వేగంతో నడుస్తుంది. తక్కువ వాటేజీని తీసుకుంటుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది.

మరోవైపు, సాధారణ AC లేదా నాన్-ఇన్వర్టర్ ACలో ఇలాంటి సదుపాయం లేదు. AC ఆన్ చేయగానే దాని కంప్రెసర్ పూర్తి శక్తితో విద్యుత్‌ను తీసుకుంటుంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీల వద్ద సెట్ చేస్తే, గది ఉష్ణోగ్రత 25 అయ్యే వరకు, అది దాని పూర్తి సామర్థ్యంతో నడుస్తుంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు చేరుకున్న తర్వాత కంప్రెసర్ ఆఫ్ చేస్తాం. గది వేడిగా ఉన్నప్పుడు మరలా అది ప్రారంభమవుతుంది. ఈ విధంగా, కంప్రెసర్ తరచుగా ఆఫ్, ఆన్ చేయడంతో లోడ్ ఎక్కువగా పడుతుంది.

ఇన్వర్టర్ AC ధర..

ధర గురించి మాట్లాడితే, అనేక ఇన్వర్టర్లు ACలు రూ. 22 నుంచి 25 వేల పరిధిలో లభిస్తాయి. ఇందులో, రూ. 25 వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధర కలిగిన Samsung కంపెనీ రెండు మోడల్‌లు ఉన్నాయి. ఈ రోజుల్లో కూలర్లు కూడా ఈ రేటుతో రావడం ప్రారంభించాయి. ఎందుకంటే అందులో సాంకేతికత వేగంగా మారిపోయింది. చాలా పెద్ద కంపెనీలు ప్రస్తుతం కూలర్ల మార్కెట్‌లోకి ప్రవేశించాయి. స్టార్ రేటింగ్‌ను బట్టి AC ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి. మార్కెట్‌లో మంచి కంపెనీల త్రీ స్టార్ ఏసీలు కూడా ఉన్నాయి. వీటి ధర రూ.15-16 వేల నుంచి మొదలవుతున్నాయి.

నిర్వహణ ఖర్చు గురించి మాట్లాడితే, సాధారణ లేదా నాన్-ఇన్వర్టర్ AC తక్కువ ఖర్చుతోపాటు రిపేర్ లేదా సర్వీసింగ్ తక్కువగా ఉంటుంది. మరోవైపు ఇన్వర్టర్ ఏసీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే దాని భాగాలు ఖరీదైనవి. చాలా వస్తువులు ఖరీదుగా ఉంటాయి. సాధారణ ACలో ఒక PCB మాత్రమే ఉంది. అది పాడైపోయినప్పుడు మార్కెట్‌లో సులభంగా అందుబాటులో ఉంటుంది. కానీ ఇన్వర్టర్ ACలోని PCBలు అందుబాటులో లేవు. మీరు దాని మరమ్మత్తు లేదా నిర్వహణ కోసం కంపెనీకి వెళ్లాల్సి ఉంటుంది.
Less AC Current Bill Tips : ఏసీ వాడుతున్నారా.. వేసవిలో కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad