Trending

6/trending/recent

India Covid-19: ఫోర్త్ వేవ్ భయందోళనలు.. దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

India Covid-19: ఫోర్త్ వేవ్ భయందోళనలు.. దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల సూచనలతో కేంద్రం సైతం అప్రమత్తమైంది. కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ సహా ముంబై తదితర ప్రాంతాల్లో కరోనా ( Coronavirus ) కేసులు.. పెరుగుతున్నాయి. ఢిల్లీలో నిన్న వేయికిపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పలు రాష్ట్రాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న ఆంక్షలు సైతం విధించారు. కాగా.. శుక్రవారం కూడా కేసులు రెండు వేల మార్క్ దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 2,527 (0.56 శాతం) కేసులు నమోదు కాగా.. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 15,079 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

  •     తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కేసుల సంఖ్య 4,30,54,952 కి చేరింది.
  •     కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 522149 కి పెరిగింది.
  •     నిన్న కరోనా నుంచి 1656 మంది కోలుకున్నారు.
  •     వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,17,724 కి చేరింది.
  •     రికవరీ రేటు 98.75 శాతం ఉంది.
  •     ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 187,46,72,536 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  •     నిన్న 19,13,296 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  •     దేశంలో నిన్న 4,55,179 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
  •     ఇప్పటివరకు 83.42 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.
India Covid-19: ఫోర్త్ వేవ్ భయందోళనలు.. దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad