Trending

6/trending/recent

Food: మూడు పూటల అన్నమే తింటున్నారా.. అయితే ఇలా చేయండి..

 చాలా మంది మూడు పూటల అన్నమే(Rice) తింటారు. అయితే శరీరక శ్రమ ఉన్నవారికి మూడు పూటల అన్నం తిన్నా ఏం కాదు.

Food: మూడు పూటల అన్నమే తింటున్నారా.. అయితే ఇలా చేయండి..

చాలా మంది మూడు పూటల అన్నమే(Rice) తింటారు. అయితే శరీరక శ్రమ ఉన్నవారికి మూడు పూటల అన్నం తిన్నా ఏం కాదు. కానీ ఆఫీస్‌(Office)ల్లో కూర్చిని పని చేసేవారు, ఇంటికే పరిమితం అయ్యే వారు కూడా మూడు పూటల అన్నం(Food) తింటున్నారు. కానీ ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. నిజానికి అన్నంలో పోషకాలు ఉండవు. కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. మూడు పూటల అన్నం తింటే బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణంగా మన దగ్గర ఇక్కడ వరి ధాన్యాన్ని ఎక్కువగా పండిస్తారు. కొంత మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అంటూ మూడుపూటల కూడా అన్నాన్నే తీసుకుంటారు. ఇలా మూడు పూటలు రైసే తినేవారు.. అన్నం కంటే కూరలు ఎక్కవ తీసుకోవాలి.

అన్నంలో కూరలను ఎక్కువగా తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. 400 గ్రాముల కూరగాయలు మీ రోజు వారి ఆహారంలో ఉండేట్టు చూసుకోలని చెబుతుంది. అలాగే రకరకాల పండ్లను సైతం తీసుకుంటూ ఉండాలి. కూరగాయల్లో ఆకు కూరలు, దుంపలు, ఇతర కాయగూరలు ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  పోషకలేమి సమస్యలు తలెత్తకూడదంటే కీరదోస కాయ, క్యారెట్లె, బీట్ రూట్ లను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూడు పూటల అన్నం తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ముందని హెచ్చరిస్తున్నారు. అన్నం తీసుకున్నా.. కూరగాయలే ఎక్కువ తీసుకోవాలని.. మాంసాహారం చికెన్, మటన్ వంటి ఆహారాలను ఎక్కువగా తినకపోవడమే మంచిదన్నారు.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. 

Food: మూడు పూటల అన్నమే తింటున్నారా.. అయితే ఇలా చేయండి..

 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad