Trending

6/trending/recent

Fish Benefits: మీకు చేపలు తినే అలవాటు ఉందా..? అద్భుతమైన ప్రయోజనాలు..!

Fish Benefits: ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని ఆహారాలను తీసుకుంటే మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకొవచ్చంటున్నారు వైద్య నిపుణులు.. 

Fish Benefits: మీకు చేపలు తినే అలవాటు ఉందా..? అద్భుతమైన ప్రయోజనాలు..!

Fish Benefits: ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని ఆహారాలను తీసుకుంటే మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకొవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మానవులకు లభించే ముఖ్యమైన మాంసహార పదార్థాల్లో చేపలు (Fish) ఒకటి. చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువ.. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. తరుచూ చేపలు తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని 2016లోనే అమెరికన్ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.

చేపలతో మానసిక ఆందోళన తగ్గుతుందని, ప్రతి రోజు ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. గొంత క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌ ఇతర రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

☛ చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు.
☛ చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
☛ చేపలను ఎక్కువగా తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి.
☛ నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
☛ చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఎంతగా ఉపయోగపడతాయి.
☛ పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఓ అధ్యయ వివరాలను ప్రచురించారు.
☛ స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
☛ చేపల్లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనం ఆరోగ్యవంతంలా ఉండేలా చేస్తాయి. ఎముకల్ని గట్టిగా చేసే విటమిన్-డీ, కాల్షియం చేపల్లో పుష్కలంగా ఉంటుంది.
☛ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయి. డిప్రెషన్, ఒత్తిడిని నివారించి ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.
☛ అలాగే పలు రకాల కాన్సర్లకు చేపలు చెక్ పెడతాయని నిపుణుల అధ్యనంలో తేలింది. పిల్లల్లో అస్తమాను నివారించేందుకు చేపలు ఔషధంగా పనిచేస్తాయి.
☛ చేపలు దృష్టిని మెరుగుపర్చడంతోపాటు.. నిద్ర సమస్యలను దూరం చేస్తాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిది. చేపల్లోని ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్‌ సరిపడా ఉండేలా చేస్తుంది.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణులు, పరిశోధకుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)

[post_ads]
Fish Benefits: మీకు చేపలు తినే అలవాటు ఉందా..? అద్భుతమైన ప్రయోజనాలు..!

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad