Trending

6/trending/recent

Diabetes precautions: మధుమేహం నుంచి రక్షణ కావాలంటే ఎలాంటి ఫుడ్​ తీసుకోవాలి​.. ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

మారుతున్న జీవన శైలి కారణంగా మన శరీరానికి అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటిస్(Diabetes). డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధి(disease) కావచ్చు. కానీ ఎవరికైతే డయాబెటిస్​ వచ్చిందో వారికి జీవిత కాలంలో చాలా కాలం మధుమేహం(diabetes) ఉంటుంది.

Diabetes precautions: మధుమేహం నుంచి రక్షణ కావాలంటే ఎలాంటి ఫుడ్​ తీసుకోవాలి​.. ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధి(disease) కావచ్చు. మారుతున్న జీవన శైలి కారణంగా మన శరీరానికి అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటిస్(Diabetes).  కానీ ఎవరికైతే డయాబెటిస్​ వచ్చిందో వారికి జీవిత కాలంలో చాలా కాలం మధుమేహం(diabetes) ఉంటుంది.

శరీరంలో గ్లూకోజ్(glucose) పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు ఇన్స్యులిన్ హార్మోన్(hormone) స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది.

తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు(eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం(weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం దీని ముఖ్య లక్షణాలు.

మధుమేహ వ్యాధిని, అది ముదరక మునుపే, ముందుగానే గుర్తించి ఆహారం, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే అరికట్టవచ్చు. అందులో ముఖ్యంగా ఆహారంలో కొన్ని పండ్లు తీసుకోవడంతో మధుమేహాన్ని కొద్దిగా అదుపులో పెట్టొచ్చు.

మధుమేహం గలవారు ఫాస్ట్ ఫుడ్స్ (fast-food) తీసుకొనేటట్లయితే వారిలో ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది. సాధారణంగా మధుమేహులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవటానికి పండ్లు, గింజలు వంటివి దగ్గర పెట్టుకుంటే మంచిది.

మానసిక ఆందోళన, ఒత్తిడి వలన రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుంది .కనుక సమయం దొరికినప్పుడల్ల శ్వాససంబంధ వ్యాయామం (Exercise) చేస్తే ఆందోళనను, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.

మధుమేహులు పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు అనేది అందరికి తెలిసిన సత్యం. ఇటీవల పరిశోధన ద్వారా తెలిసిన విషయం ఎక్కువ పిండి పదార్థాలు తీసుకుంటే ఎవరిలోనైన త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మధుమేహం నియంత్రించలన్నా , నివారించాలన్నా తక్కువ పిండి పదార్థాలను గల ఆహారం తీసుకోవాలి

టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాలపాటు నడవాలని (Walk) నిపుణులు(experts) సూచిస్తున్నారు. ఓ పరిశోధనలో అలా నడిచిన వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పరిశోధకులు కొలిచారు.

రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్ పేషెంట్ల రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలకు మంచి ఫలితాలు వచ్చాయంట. మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12శాతం అధికంగా తగ్గిపోయాయి.

Diabetes precautions: మధుమేహం నుంచి రక్షణ కావాలంటే ఎలాంటి ఫుడ్​ తీసుకోవాలి​.. ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad