Trending

6/trending/recent

DGE Video Message on SSC Examinations : పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి వీడియో సందేశం

DGE Video Message on SSC Examinations :  పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి వీడియో సందేశం... 

(1)ప్రశ్న పత్రాలను ఫోటోలు తీసి బయటకు పంపేవారీ మీద, వాటిని వాట్సప్ లో స్ప్రెడ్ చేసే వారిపై కూడా  ఎగ్జామ్స్ యాక్ట్ 25/97 ప్రకారం కేసులు బుక్ చేస్తాం.

(2).. ప్రైవేటు వ్యక్తులను, పిల్లలను ఎగ్జామ్  విధులలో ఉండకూడదు. ప్రైవేట్ వ్యక్తులు, పిల్లలు, మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలలో కనిపిస్తే పూర్తి బాధ్యత చీఫ్ సూపర్డెంట్ లదే... 

- డి. దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఆంధ్ర ప్రదేశ్.

DGE Message on SSC Examinations : పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి వీడియో సందేశం

పత్రిక ప్రకటన

పదవ తరతి పరీక్షలు April/May 2022 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఏప్రిల్ 27 నుండి మే 9 వరకు ఉదయం గం|| 9.30 ని॥ల నుండి 12.45ని॥ల మధ్య నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలుగు, హింది, ఇంగ్లీష్ పరీక్షలు ఇప్పటికే జరిగాయి. గణితం, ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్, సోషియల్ స్టడీస్, సంస్క ృతం, ఒకేషనల్ పరీక్షలు నిర్వహించవలసి ఉంది.

ప్రభుత్వం ఎంతో పకడ్బంది ఏర్పాట్ల మధ్య పదో తరగతి ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రానికి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో భద్రపరిచి, పరీక్ష జరిగే రోజు పరీక్షకు గంట ముందు (ఉదయం 8.30) పరీక్ష కేంద్రానికి చెందిన చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఆ రోజు పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి విత్ డ్రా చేసుకొని 9 గంటలకు పరీక్ష కేంద్రాలను చేరుకొని, పరీక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరి ఇన్విజలేటర్ల సమక్షంలో సీల్ను 9.15 నిమిషాలకు తెరచి సంబంధిత పరీక్షా గదులలోనికి గం॥ 9.25 నిమిషాలకు ప్రశ్నపత్రాలను పంపుతారు. 9.30 నిమిషాలకు పరీక్ష రాసే విద్యార్థుల చేతికి ప్రశ్న పత్రం అందిస్తారు.

పరీక్ష ప్రారంభం అయిన అనంతరం కొందరు స్వార్థప్రయోజనాల కోసం పరీక్ష కేంద్రాలలో పనిచేసే ఒక్కరిద్దరు సిబ్బందితో కుమ్మక్కై పరీక్ష పత్రాలను మొబైల్తో ఫొటో తీసి బయటకు వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతున్నది. (చీఫ్ సూపరింటెండెంట్కు తప్ప మిగిలినవారికి ఫోన్ లోపలకి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ) ఇలా ప్రశ్న పత్రాలు బయటకు పంపిన వారిపైన, వాటిని వాట్సాప్ లో షేర్ చేసిన వారిపైన Examination Act 25/97 ప్రకారం కేసులు బుక్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో 4గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం, 12 మందిని అరెస్ట్ చేయడం, చిత్తూరు జిల్లాలో ఇద్దరిని సస్పెండ్ చేయడం, 7 మందిని అరెస్ట్ చేయడం, సత్యసాయి జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

కావున జరగబోయే పరీక్షలలో కూడా ప్రశ్న పత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్ చేసేవారిపైన Examination Act 25/97 ప్రకారం కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రశ్నపత్రం షేర్ చేసిన వాళ్ళు కూడ శిక్షార్హులే. కావున మీ ఫోను ఎవరైనా ప్రశ్న పత్రం పంపినపుడు అది ఎవరికీ షేర్ చేయకుండా, ఏ నంబర్ నుంచి మీకు వచ్చిందన్న విషయాన్ని మీకు దగ్గరర్లోని పోలీస్ స్టేషన్లో గాని, మండల విద్యాశాఖాధికారికి గాని వెంటనే తెలియజేయాలి.

జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు కూడా ప్రశ్నపత్రం షేర్ చేస్తున్న వారిని నంబర్లు నోట్చేసుకొని వెంటనే Act 25/97 ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేసి, షేర్ చేసిన వారిని అరెస్ట్ చేసే విధంగా చేయాలి. మీడియా ప్రతినిధులు కూడా సహకరించి ఎవరైన ప్రశ్న పత్రాలు వాట్సాప్ లో షేర్ చేస్తే అవి ఏ నంబర్ నుంచి వచ్చాయో మీ దగ్గరలో విద్యాశాఖాధికారులకు గాని, పోలీసులకు గాని తెలియజేయాలి.

అదే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లకు తెలియజేయడం ఏమనగా Exams Duty లో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండాలి. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించినా, పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్లు కనిపించినా పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ వహించవలసి ఉంటుంది.

D, దేవానందరెడ్డి
డైరక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad