Trending

6/trending/recent

Coronavirus: కరోనాని నివారించాలంటే ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Coronavirus: క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్‌ ముప్పు మరోసారి పొంచి ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Coronavirus: కరోనాని నివారించాలంటే ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Coronavirus: క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్‌ ముప్పు మరోసారి పొంచి ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది కరోనా నాలుగో వేవ్ అయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు భావిస్తు్న్నారు. WHO ప్రకారం.. కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ పరిస్థితిలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు మీ కుటుంబం ప్రమాదంలో పడవచ్చు. క‌రోనా వైర‌స్ వ‌చ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రజ‌లు మాత్రం ఇంకా నిర్లక్షంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణం అవుతుంది. తేలికపాటి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలని తేలికగా తీసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. పరీక్షలు చేయించుకోని వారికి ఇన్‌ఫెక్షన్‌ వేగంగా వ్యాపిస్తోంది. వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా ఉండదనే అపోహ చాలామందిలో ఉంది. ఇది అస్సలు కరెక్ట్‌ కాదు. బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తులు కూడా దీని బారిన పడుతున్నారు. కాబట్టి కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

1. కరోనా వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తీసుకున్నట్లయితే కరోనా ఇన్ఫెక్షన్ రాదని కొంతమంది అనుకుంటున్నారు. కానీ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా బారిన పడే అవకాశాలున్నాయి. కానీ మీ లక్షణాలు ఇతర వ్యక్తుల కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం మాత్రమే ఉంటుంది.

2. ఒక్కసారి కరోనా వచ్చిందంటే శరీరం కరోనాతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుందని అపోహ చాలామందిలో ఉంది. మీరు కూడా అలా అనుకుంటే అది తప్పు. కొంతమందికి 2 నుంచి 3 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

3. కరోనా, ఓమిక్రాన్ లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఓమిక్రాన్ సోకిన వారిలో చాలా మంది జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. చాలా మంది ప్రజలు ఇంట్లో మందులు తీసుకోవడం ద్వారా నయమవుతున్నారు. కానీ కొన్ని కేసులు తీవ్రంగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

4. కరోనా కేసులు తగ్గిన వెంటనే ప్రజలు మాస్కులు ధరించడం తగ్గించారు. కరోనా ఇంకా ముగియలేదని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలి. మాస్కు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. మీ అజాగ్రత్త మిమ్మల్ని ప్రమాదంలో పడేసే అవకాశాలు ఉంటాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Coronavirus: కరోనాని నివారించాలంటే ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad