Trending

6/trending/recent

Chanakya Niti: సమాజంలో గౌరవ మర్యాదల పొందాలంటే.. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోలో చెప్పిన చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)మంచి సామాజిక శాస్త్రవేత్త. ఇతను రచించిన నీతి శాస్త్రం(Niti Sastra) .. చాణక్య నీతిగా ఖ్యాతిగాంచింది.

Chanakya Niti: సమాజంలో గౌరవ మర్యాదల పొందాలంటే.. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోలో చెప్పిన చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)మంచి సామాజిక శాస్త్రవేత్త. ఇతను రచించిన నీతి శాస్త్రం(Niti Sastra) .. చాణక్య నీతిగా ఖ్యాతిగాంచింది. ఇందులో చాణుక్యుడు పేర్కొన్న విధానాలను అవలంబించే వ్యక్తికి సమాజంలో ప్రాముఖ్యత పెరుగుతుందని, గొప్ప వ్యక్తి  అవుతాడని పెద్దల నమ్మకం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. మీరు ఎలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలను కూడా చాణక్యుడు తన పుస్తకంలో పేర్కొన్నాడు. మనిషి జీవితంలో అనేక రకాల వ్యక్తులను కలుస్తూనే ఉంటారు. అయితే ఎవరితో ఎవరు ఎలా నడుచుకోవాలనేది తెలుసుకోవడం ముఖ్యం. అలా వ్యక్తి ప్రవర్తన తెలుసుకుని నడుచుకోవడం వలన జీవితంలో కష్టాలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

హింసాత్మక స్వభావం కలిగి ఉన్న వ్యక్తులు: 

చాలా మంది వ్యక్తులు హింసాత్మక స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఏదో ఒక విధంగా మరొకరి జీవితానికి హాని చేయడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి వారిని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైనంత వరకూ ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండడం మేలు అని చాణుక్యుడు పేర్కొన్నాడు.  హింసామార్గాన్ని ఎంచుకున్న వ్యక్తుల స్వభావం మనల్ని విధ్వంసం వైపు నడిపిస్తుంది.

చెడు ప్రవృత్తి:  ఎప్పుడూ దుష్ట ధోరణులతో నడిచే వ్యక్తితో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చాణుక్యుడు పేర్కొన్నాడు. దుర్మార్గపు వ్యక్తులను స్వభావాన్ని అనుసరిస్తూ.. మీరుకూడా అదే విధమైన నిర్ణయాలు తీసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఇలా చేసిన తర్వాత, ఏ విధమైన పశ్చాత్తాపం చెందకండి, ఎందుకంటే మీరు దుర్మార్గులతో మంచి ప్రవర్తన కలిగి ఉంటే, నెక్స్ట్ టైం అతను మీకు చెడు చేస్తాడు. ఒక్కసారి గుణపాఠం చెబితే మీకు కీడు చేయాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు.  చెడు వ్యక్తికి దూరం ఉండడం వలన మీకు మనశ్శాంతి లభిస్తుంది.

శ్రేయోభిలాషులు:  చాణక్యుడి ప్రకారం.. అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం లేదు. ఉపకారం చేయాలనే ధోరణిని అవలంబించే వారితో పాటు, మీరు కూడా పరోపకార వైఖరిని అలవర్చుకోవాలి. అవతలివారు మీ కోసం కొంచెం చేస్తే, మీరు వారికి రెట్టింపు చేస్తారు. అలాంటి ప్రవర్తనను అలవర్చుకోవడం ద్వారా రెట్టింపు పురోగతిని సాధించవచ్చని చెప్పారు. శ్రేయోభిలాషిని అవమానించడం ద్వారా జీవితంలో విజయం సాధించలేము. అదే సమయంలో, అతను అనుకూలంగా ఎల్లపుడూ వంత పడకూడదు.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలపై ఆధారపడి ఇవ్వబడింది.  న్యూస్ టోన్ తెలుగు వీటిని ధృవీకరించలేదు. )

[post_ads]
Chanakya Niti: సమాజంలో గౌరవ మర్యాదల పొందాలంటే.. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోలో చెప్పిన చాణక్య

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad