Trending

6/trending/recent

Cancer: కేన్సర్ అంటే ఏంటి? ఎవరికి, ఎందుకు వస్తుంది? లక్షణాలేంటో తెలుసుకుని జాగ్రత్తవహించండి..

Cancer: మానవ శరీరం కణాలతో నిర్మితమైంది. అసలు కేన్సర్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? ఎన్ని రకాలు దీన్ని ఎలా నివారించవచ్చు తెలుసుకుందాం. 

Cancer: కేన్సర్ అంటే ఏంటి? ఎవరికి, ఎందుకు వస్తుంది? లక్షణాలేంటో తెలుసుకుని జాగ్రత్తవహించండి..

కేన్సర్ అంటే మన శరీరంలో పెరుగుతున్న కణాలు నియంత్రణ కోల్పోయి, ఇష్టానుసారంగా ఒక గుంపు మాదిరి ఒకే దగ్గర పెరగడాన్ని కేన్సర్ అంటారు. అంటే ఇది ఒక కణజాల సమూహం అని చెప్పవచ్చు. ఇలా కొత్త సెల్స్ తయారై ఒక గుంపుగా తయారవుతాయి. వీటిని ట్యూమర్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మెలిగ్నట్ ట్యూమర్ మరోటి బినైన్ ట్యూమర్. మొదటిది చాలా ప్రమాదకరం. ఇది పెరుగుతూ బాడీ లో వ్యాపించి ఇతర టిష్యూస్ కూడా కేన్సర్ ని స్ప్రెడ్ చేస్తాయి. బనాయన్ ట్యూమర్ అలా కాదు. ఇది వ్యాపించదు, పక్క టిష్యూస్ పై దాడి చేయదు. ఇవి అప్పుడప్పుడు పెద్దవిగా మారతాయి. వీటిని ఆపరేషన్ చేసి తీసివేస్తే.. మళ్లీ పెరగవు. కానీ, మెలిగ్నెట్ ట్యూమర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.

కేన్సర్ సెల్స్, నార్మల్ సెల్స్ కు తేడాలు..

ఈ రెండింటికీ చాలా తేడాలు ఉన్నాయి. కేన్సర్ కణాలు మన బాడీ ఇమ్యూన్ సిస్టం ను ప్రభావితం చేస్తాయి. నార్మల్ కణాలు వాటికి ఉండే పనిని సక్రమంగా నిర్వహిస్తాయి

కేన్సర్ కు కారణాలు..

కేన్సర్ ఒక జన్యుపరమైన వ్యాధి. మన సెల్స్ ఎలా పెరగాలో? ఎలా పనిచేయాలో మన బాడీలోని జీన్స్ డిసైడ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ జీన్స్ కంట్రోల్ చేస్తాయి. జీన్స్ నియంత్రణ కోల్పోతే కేన్సర్ కణాలు ఇలా ఇష్టానుసారంగా పెరిగిపోతాయి. ఈ జన్యుపరమైన మార్పులు మన శరీరం కొన్నిరకాల ఎన్విరాన్ మెంట్కు మన శరీరంలో టిష్యూలోని డీఎన్ ఏ దెబ్బతింటుంది.

దీని అర్థమేంటంటే కేన్సర్ మన బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఇలా మన డీఎన్ ఏ డ్యామేజ్ అవుతుంది. ఇది పొగ తాగడం, అల్ట్రావైలట్ రేస్, ఎక్సర్ సైజ్ లేకపోవడం, ఆల్కహాల్ అతిగా తాగడం, ఒబేసిటీ వల్ల కూడా కేన్సర్ వస్తుంది. ఏదైనా కెమికల్స్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తంది. కేన్సర్ లో 100 పైగా రకాలున్నాయి. అయితే, మనకు ఎక్కువగా వినిపించేది కార్సినోమా కేన్సర్. ఎపితేలియల్ సెల్స్ బాడీ అంతటా ఉంటాయి. ఇవి శరీరానికి బయట, లోపల కవర్ చేస్తాయి. ఈ కార్సినోమా కేన్సర్ ఎపితేలియల్ సెల్స్ ద్వారానే ఏర్పడతాయి. తర్వాత అడేనో కార్సినోమా కేన్సర్. ఇది కూడా ఈ సెల్స్ ద్వారానే ఏర్పడతాయి. బ్రెస్ట్ కేన్సర్, పెద్దపేగు కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్ దీని వల్లనే వస్తుంది.

సర్కోమా అనే కేన్సర్ మన శరీరంలోని బోన్స్, మజిల్స్, బ్లడ్ వెజిల్స్లో వస్తుంది. ల్యుకేమియా కేన్సర్ ను బ్లడ్ కేన్సర్ అని కూడా అంటారు. ఇది బోన్ మ్యారోలో ఏర్పడుతుంది. దీనివల్ల వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగి, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గుంది. దీంతో బాడీలో టిష్యూస్ కి ఆక్సిజన్ లెవల్ తగ్గిపోతుంది. ఇంకా బ్రెయిన్, లంగ్, స్కిన్ కేన్సర్ లు కూడా ఉన్నాయి.

లక్షణాలు..

కేన్సర్ లక్షణాలు గొంతునొప్పి తగ్గకుండా, తిన్నది డైజెస్ట్ అవ్వకపోవడం. శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది. చర్మంపై పుండ్లు, జ్వరం రావడం, ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం.
కేన్సర్ లో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 0 లో కేన్సర్ సర్జరీ ద్వారా తగ్గించుకోవచ్చు. చివరి స్టేజ్ అయిన స్టేజ్ 4 వేరే ఆర్గాన్స్పై అటాక్ చేస్తాయి. కేన్సర్ లో కొన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. కీమో థెరపీ, సర్జరీ, రేడియేషన్, స్టెమ్ సెల్స్ మొదలైనవి. ఇప్పటి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా కేన్సర్ ను క్యూర్ చేయగలం. అయితే, హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల కూడా కేన్సర్ నివారించవచ్చు.

Cancer: కేన్సర్ అంటే ఏంటి? ఎవరికి, ఎందుకు వస్తుంది? లక్షణాలేంటో తెలుసుకుని జాగ్రత్తవహించండి..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad