Trending

6/trending/recent

Bail for Pregnancy :భార్యకు కడుపు చేసిరాపో: జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్.. హైకోర్టు అరుదైన తీర్పు

అరుదైన తీర్పు ఒకటి తాజాగా వెలువడింది. పడకసుఖానికి దూరమైన భార్యకు కడుపు చేసి రావడానికిగానూ జీవిత ఖైదీకి కోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. వివరాలివే..

భార్యకు కడుపు చేసిరాపో: జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్.. హైకోర్టు అరుదైన తీర్పు

వేర్వేరు కేసుల్లో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి కోర్టులు ఇచ్చే తీర్పులు భిన్నంగా ఉంటాయి. వయసు మీదపడి, కనీసం నడవలేని స్థితిలో ఉన్న కొందరు ఖైదీలకు కనీసం ఆస్పత్రికి వెళ్లే అవకాశం కూడా దక్కని ఘటనలు కొన్నయితే.. హత్యాకాండ కేసుల్లోనూ వీవీఐపీలు, రాజకీయ నేతలకు ఇట్టే బెయిల్ దొరికే ఉదంతాలు కోకొల్లలు. అయితే, అత్యంత అరుదైన తీర్పు ఒకటి తాజాగా వెలువడింది. పడకసుఖానికి దూరమైన భార్యకు కడుపు చేసి రావడానికిగానూ జీవిత ఖైదీకి కోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. వివరాలివే..

ఒకరు నేరం చేసి జైలుకు వెళితే, వారి కుటుంబాలు శిక్ష అనుభవించాల్సిన లేదా వ్యతిరేక పర్యవసనాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని రాజస్థాన్ హైకోర్టు వక్కాణించింది. భార్య గర్భదారణ కోసమని ఓ ఖైదీకి 15 రోజుల బెయిల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు జోధ్ పూర్ శాఖ అరుదైన తీర్పు ఇచ్చింది. వ్యక్తి చేసిన నేరం వల్ల శృంగార సుఖానికి ఆమె దూరమైందన్న కోర్టు.. సంతానం పొందే హక్కు ఆమెకు ముమ్మాటికీ ఉందని స్పష్టం చేసింది.

సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకునేందుకు జీవితఖైదీగా ఉన్న భర్తను విడుదల చేయాలంటూ ఖైదీ నందలాల్ భార్య దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు జోధ్ పూర్ బెంచ్ విచారించింది. ఓ తీవ్ర నేరానికి సంబంధించి నందలాల్ కు 2019లో భిల్వారా కోర్టు జీవితఖైదు విధించింది. కాగా, అతని భార్య పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఫర్జాంద్ అలీ ధర్మాసం ఈ మేరకు శుక్రవారం తమ తీర్పును వెల్లడించాయి. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘ఖైదీ నందలాల్ భార్య అమాయకురాలు. భర్త జైలులో ఉండటం వల్ల.. వైవాహిక జీవితంతో ముడిపడిన శృంగార, భావోద్వేగ అవసరాలు ఆమెకు దూరమయ్యాయి. సంతానం పొందే హక్కు ఖైదీకి కూడా ఉంటుంది. ఆయా కేసుల్లో వాస్తవాలు, పరిస్థితులపై అది ఆధారపడి ఉంటుంది’ అని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. భార్యకు కడుపు చేసేందుకుగానూ జీవితఖైదీ నందలాల్ కు 15 రోజుల పెరోల్ మంజూరైంది.

Bail for Pregnancy :భార్యకు కడుపు చేసిరాపో: జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్.. హైకోర్టు అరుదైన తీర్పు


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad