Trending

6/trending/recent

Bad News : ఉద్యోగులు, పెన్షనర్లకు ఇక ఆ డబ్బులు ఇచ్చేది లేదు.. బ్యాడ్ న్యూస్!

Dearness Allowance |కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు హ్యాండిచ్చింది. కోవిడ్ 19 సమయంలో స్తంభింపజేసిన డియర్‌నెస్ రిలీఫ్ చెల్లించాలంటూ పెన్షనర్లు ప్రభుత్వాన్నికోరారు. అయితే కేంద్రం మాత్రం స్తంభింపజేసిన డీఏ, డీఆర్ చెల్లింపులు ఉండవంటూ తెలియజేసింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపు రూ. 34 వేల కోట్లు నష్టపోయినట్లు అవుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్‌కు చెందిన అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. కాగా ప్రభుత్వం మూడు ఇన్‌స్టాల్‌మెంట్లను ఆపేసిన విషయం తెలిసిందే.
  • పెన్షనర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
  • స్తంభింపజేసిన డీఏ, డీఆర్ చెల్లింపులు ఉండవని వెల్లడి
  • దీని వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు నష్టం
  • ప్రభుత్వానికి రూ.34 వేల కోట్లు ప్రయోజనం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బ్యాడ్ న్యూస్. స్తంభింపజేసిన డియన్‌నెస్ అలవెన్స్ DA , డియర్‌నెస్ రిలీఫ్ DR పెంపును చెల్లించేది లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్రం మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ, డీఆర్‌ పెంపును నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని చెల్లించాలంటూ పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆర్థిక శాఖ మంత్రి ఈ రిక్వెస్ట్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కోవిడ్ 19 కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు Employees , పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపును నిలిపివేసిన విషయం తెలిసిందే. ఖర్చులు తగ్గించుకోవడం లేదంటే వ్యయ నియంత్రణలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఆర్, ఉద్యోగులకు లభించాల్సిన డీఏ పెంపు మొత్తాన్ని కలుపుకుంటే దాదాపు రూ.34 వేల కోట్లు రావాల్సి ఉందని తెలుస్తోంది. డీఏ, డీఆర్ అనేవి జీవన వ్యయానికి సర్దుబాటు చేయడానికి, ద్రవ్యోల్బణం కారణంగా బేసిక్ పే లేదా పెన్షన్‌లో Pension కోత నుంచి రక్షించడానికి చెల్లిస్తారు. ఇదే విషయాన్ని పెన్షనర్లు కేంద్రానికి గుర్తు చేశారు.

పెన్షన్ నిబంధనల సమీక్ష, సవరణ‌కు సంబంధించి స్టాండింగ్ కమిటీ ఆఫ్ వాలంటరీ ఏజెన్సీస్ 32వ సమావేశంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్ (డీఓఈ)కి చెందిన అధికారి ఒకరు స్తంభింపజేసిన డీఏ, డీఆర్ చెల్లింపు ఉండబోదని వివరించినట్లు జాతీయ మీడియా పేర్కొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన విభాగమే డీఓఈ. జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో స్తంభింపజేసిన డీఏ, డీఆర్ చెల్లింపుపై కూడా చర్చ జరిగింది. చివరకు చెల్లించలేమని ప్రభుత్వం తెలియజేసింది.

అయితే ఈ అంశంపై ఆర్థిక శాఖకు, డీఓఈకి మెయిల్ పంపితే ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 21న డీఏ, డీఆర్‌ పెంపు నిలుపుదలను ఎత్తివేసింది. అప్పటికే మూడు ఇన్‌స్టాల్‌మెంట్ డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రావాల్సి ఉండేది. కాగా డీఏ, డీఆర్ అనేవి పెన్షన్ శాఖ పరిధిలోకి రావని పెన్షన్స్ అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ పెంపు నిలుపుదల చేసింది. కోవిడ్ 19 వచ్చిన తర్వాతి నెల నుంచి ఈ రూల్ అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. 01.01.2020, 01.07.2020, 01.01.2021 ఇన్‌స్టాల్‌మెంట్లను స్తంభింపజేశారు. ఇలా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.34,402 కోట్లు ఆదా అయ్యాయని 2021 ఆగస్ట్ నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్య సభలో వెల్లడించారు. వడ్డీతో కలుపుకుంటే ఈ విలువ రూ.36 వేల కోట్లుగా ఉండొచ్చు. కాగా కేంద్ర ప్రభుత్వం మార్చి 30న డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు డీఏ 34 శాతానికి చేరింది. దీని కన్నా ముందు 2021 అక్టోబర్ నెలలో మోదీ సర్కార్ డీఏను 3 శాతం పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు ఇది 31 శాతానికి చేరింది. దీనికి ముందు 2021 జూలైలో కేంద్రం డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది.
Bad News : ఉద్యోగులు, పెన్షనర్లకు ఇక ఆ డబ్బులు ఇచ్చేది లేదు.. బ్యాడ్ న్యూస్!


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad