Just In

6/trending/recent

Ads Area

AP: వీరి ఇంగ్లీష్ వింటే మంచు లక్ష్మి మురిసిపోవడం ఖాయం.. అదరగొడుతున్న బెండపూడి విద్యార్థులు

పల్లెల్లో ఫారన్ ఇంగ్లీష్.. అలాగని మన పల్లెలకు ఫారెన్ వాళ్లు వచ్చారు అనుకోకండి. ఫారెన్ లాంగ్వేజ్ తో అదరహో అనిపిస్తున్నారు మన ఏపీలోని ఓ గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిలు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

AP: వీరి ఇంగ్లీష్ వింటే మంచు లక్ష్మి మురిసిపోవడం ఖాయం.. అదరగొడుతున్న బెండపూడి అమ్మాయిలు

AP: వీరి ఇంగ్లీష్ వింటే మంచు లక్ష్మి మురిసిపోవడం ఖాయం.. అదరగొడుతున్న బెండపూడి అమ్మాయిలు

మీకు ఇంగ్లీష్ వచ్చా.. ఇంగ్లీష్ అంటే హాయ్ హౌ ఆర్ యు…వేర్ ఆర్ యూ గోయింగ్.. ఐయామ్ వెయిటింగ్.. చిన్న పదాలు కాదు.  ‘ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్  ఫెస్టివల్’.. ‘ఎంకీస్ మ్యారేజ్.. సుబ్బీస్ డెత్ యానివర్సరీ’ లాంటి శంకర్ దాదా ఎంబిబిఎస్ బట్లర్ ఇంగ్లీష్ కాదు.. అచ్చమైన అమెరికన్ ఇంగ్లీష్.. అటువంటి ఫారిన్ ఇంగ్లీష్ పల్లెల్లో చదువుకునే మన తెలుగు మీడియం హైస్కూల్ పిల్లలు మాట్లాడితే ఎలా ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే.. అచ్చమైన పల్లెటూరి వాతావరణం కాని అక్కడి హైస్కూల్ విద్యార్థులు మాత్రం హాయ్.. హలో.. వి ఆర్ ఫ్రం బెండపూడి… అంటూ అమెరికాలోని విద్యార్థులతో సైతం ఆన్‌లైన్‌లో ఫారన్ స్లాంగ్‌లో మాట్లాడుతున్నారు. ఏంటి మీకేమైనా డౌట్ ఉందా.. అయితే ఈ వీడియోలు చూసేయండి.

విన్నారుగా వీళ్ళు ఎట్టా మాట్లాడుతున్నారో…వీళ్ళంతా ఫారన్ వెళ్ళి వచ్చారు అనుకుంటే పోరపాటే. వీరంతా కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని ఒక చిన్న గ్రామం బెండపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు. వారికి ఈ యాక్సెంట్ ఎలా సాధ్యమనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఈ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.వి.ప్రసాద్ చొరవతోనే ఇది సాధ్యమైంది. ఈ మాస్టారు విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేందుకు ‘నేటివ్ స్పీకర్స్ క్లబ్’ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. అతని కృషికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో భాషాభివృద్ధి కార్యక్రమం తోడైంది. వెరసి ఆ పాఠశాల పిల్లలు’ ఇప్పుడు విదేశీయులు మాదిరిగానే ఆంగ్లంలో అదిరిపోయేలా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. గతేడాది నవంబరులో విద్యాశాఖ ఎల్ఐపీ (లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) 100 రోజులు ప్రణాళికను ఆచరణలో పెట్టింది. దీని ప్రకారం విద్యార్థులు రోజుకు అయిదు పదాల చొప్పున వంద రోజులకు 500 పదాలు నేర్చుకోవాలి. ప్రసాద్ మాస్టారు అప్పటికే విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేలా పలు మెలకువలు నేర్పారు. దీనికి ఎల్ఐపీ కార్యక్రమం మరింత ఊతమిచ్చింది..

ఈ పాఠశాల విద్యార్థులు ఆంగ్లం మాట్లాడుతున్నప్పుడు వింటే అచ్చం విదేశీయులెవరైనా అక్కడికి వచ్చారేమో అనిపిస్తుంది. ఇలా ఫారెన్ యాక్సెంట్ మాట్లాడుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు ఈ స్కూల్ విద్యార్థులు. ఈ వీడియోలు చూసిన వారెవరైనా పిల్లల మాటలకు మంత్ర ముగ్ధులవ్వాల్సిందే. ప్రస్తుతం పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రోజుకు రెండు గంటల పాటు ఆంగ్లం నేర్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆంగ్లంలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా నేర్చుకునేలా ఫొనిటిక్స్, ఇతర మెలకువలను రోజుకు గంటపాటు వివరిస్తున్నామని ఆంగ్ల ఉపాధ్యాయుడు జి.వి.ప్రసాద్  తెలిపారు. దీంతో పాటు విరామ సమయాల్లో ఆంగ్లంలో ప్రముఖుల రచనలు, మాటలు వినిపిస్తూ.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న ఉన్నత పాఠశాల విద్యార్థులకు, తమ పాఠశాల విద్యార్థులకు ఫోన్ ద్వారా ఆన్‌లైన్ చర్చావేదికలో పాల్గొనేలా చేశామని… దీంతో వీరు కూడా విదేశీయుల్లాగే మాట్లాడగలుగుతున్నారని వెల్లడించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information