Trending

6/trending/recent

Andhra Pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు

 ఒంగోలులో నిన్న తిరుపతి వెళ్లే ప్రయాణికుడి కారు స్వాధీనం ఘటనపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది.

Andhra Pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు

Ongole: ఒంగోలు ఆర్టీఓ అధికారుల ఓవరాక్షన్‌పై ప్రభుత్వం స్పందించింది. టీవీ9 ప్రసారం చేసిన వరస కథనాలతో స్వయంగా రంగంలోకి దిగిన CMO అధికారులు ఇద్దరు అధికారులపై వేటు వేశారు. ప్రయాణికులను బెదిరించి కారును తీసుకెళ్లిన ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెన్షన్‌ చేశారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య, హోంగార్డు తిరుమలరెడ్డిని సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులో RTO అధికారులు ఓవరాక్షన్‌ చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రాత్రంతా బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వినుకొండ(Vinukonda) నుంచి తిరుమల(tirumala)కు రెంట్‌ కారులో బయలుదేరింది శ్రీనివాస రావు కుటుంబం. టిఫిన్ చేసేందుకు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ దగ్గర ఆగారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న రవాణా శాఖ అధికారులు సీఎం టూర్‌కు కార్లు కావాలంటూ.. బలవంతంగా ఆ కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అయితే తాము కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్నామని… కారును ఇవ్వమని అధికారులను శ్రీనివాసరావు ఫ్యామిలీ ఎంత వేడుకున్నా కనికరించలేదు. కారు ఇచ్చేది లేదంటూ కావాలంటే బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇక చేసేది ఏమి లేక.. బస్టాండ్‌కు చేరుకొని వినుకొండ నుంచి మరో రెంట్‌లో తిరుమలకు వెళ్లారు. అయితే రవాణా శాఖ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన కోసమంటూ రోడ్లపై దూర ప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలను ఆపి ఆధీనంలోకి తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరు అధికారులపై వేటు వేశారు. నోటీసులు కూడా జారీ చేశారు.
Andhra Pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad