Trending

6/trending/recent

AC Buying Tips: వేసవిలో ఏసీ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

 AC Buying Guide | ఏప్రిల్‌లోనే ఎండలు ఇలా మండిపోతున్నాయంటే... మేలో చుక్కలు కనిపించడం ఖాయం. మరి ఈ వేసవితాపాన్ని తట్టుకోవడం కోసం ఎయిర్ కండీషనర్ (AC) కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి.

AC Buying Tips: వేసవిలో ఏసీ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

1. ఎండలు మండిపోతున్నాయి. వేసవితాపాన్ని అడ్డుకోవడం కోసం ఎయిర్ కండీషనర్ (AC) కొనే ఆలోచనలో ఉన్నారా? మరి ఏసీ కొనేప్పుడు ఏఏ అంశాలు గుర్తుంచుకోవాలో తెలుసా? వేసవి వచ్చిందంటే మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీ కొనాలని ఆలోచిస్తుంటారు. అయితే స్ప్లిట్ ఏసీ (Split AC) కొనాలా, విండో ఏసీ (Window AC) కొనాలా? కెపాసిటీ ఎంత ఉండాలి? ఏఏ ఫీచర్స్ ఉండాలి? అన్న సందేహాలు ఉండటం మామూలే. మరి మీరు కూడా ఇలాగే అయమయానికి గురవుతున్నట్టైతే ఏసీ కొనే ముందు ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకోండి.

2. ఏసీల్లో విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ అని రెండు రకాలు ఉంటాయి. విండో ఏసీ ఇన్‌స్టాల్ చేయడం ఈజీగా ఉంటుంది. సర్వీసింగ్ కాస్ట్ కూడా తక్కువే. కానీ సౌండ్ ఎక్కువగా ఉంటుంది. మీరు కిటికీ దగ్గర ఫిక్స్ చేయడానికి విండో ఏసీ ఉపయోగపడుతుంది. 1 టన్, 1.5 టన్, 2 టన్ కెపాసిటీతో లభిస్తాయి. విండో ఏసీ ధర కూడా తక్కువగా ఉంటుంది. 

3. స్ప్లిట్ ఏసీ ధర ఎక్కువ. స్ప్లిట్ ఏసీలో ఇంటర్నల్ యూనిట్, ఎక్స్‌టర్నల్ యూనిట్స్ ఉంటాయి. ఇంటర్నల్ యూనిట్‌ను ఇంట్లో ఫిక్స్ చేస్తారు. ఎక్స్‌టర్నల్ యూనిట్‌ను ఇంటి బయట ఫిక్స్ చేస్తారు. విండో ఏసీ కన్నా స్ప్లిట్ ఏసీ ఇన్‌స్టాల్ చేయడం కాస్త కష్టం. అందుకు ప్రత్యేకమైన స్థలం కావాలి.

4. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నట్టైతే విండో ఏసీ తీసుకోవడమే మేలు. సొంత ఇల్లు అయితే స్ప్లిట్ ఏసీ తీసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ సమస్య ఉండదు. అద్దె ఇంట్లో ఉంటూ స్ప్లిట్ ఏసీ తీసుకుంటే ఇల్లు మారిన ప్రతీ సారి ఇన్‌స్టాలేషన్ కోసం తిప్పలు పడాల్సి ఉంటుంది.

5. మీ రూమ్ సైజ్‌ని బట్టి ఏసీ కెపాసిటీ నిర్ణయించుకోవచ్చు. పెద్ద గదికి ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ కావాలి. ఏసీలు 1 టన్, 1.5 టన్, 2 టన్ కెపాసిటీతో లభిస్తాయి. చిన్న గదికి, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రూమ్‌కు ఎక్కువ కెపాసిటీ అవసరం లేదు. సాధారణంగా 1.5 టన్ ఏసీ సరిపోతుంది. ఒకవేళ మీ గది 10 x 15 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉంటే 2 టన్ ఏసీ తీసుకోవాలి. గది సైజ్ 10 x 10 చదరపు అడుగులు ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది.

6. ఏసీ వాడితే పవర్ బిల్ ఎక్కువగా వస్తుంది. అందుకే స్టార్ రేటింగ్ తప్పనిసరిగా చూడాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఏసీల్లో ఇన్వర్టర్ మోడల్స్ కూడా ఉంటాయి. మీరు ఇన్వర్టర్ వాడుతున్నట్టైతే ఇన్వర్టర్ ఏసీ తీసుకోవచ్చు. ఏసీకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇస్తే పవర్ పోయినా ఏసీ పనిచేస్తూనే ఉంటుంది.

7. బయటి వాతావరణాన్ని బట్టి గది వాతావరణం అడ్జెస్ట్ అయ్యేలా ఫీచర్స్ ఉంటాయి. అలాంటి ఏసీ తీసుకుంటే మీరు టెంపరేటర్ మార్చాల్సిన అవసరం ఉండదు. బ్యాక్టీరియా, డస్ట్ పార్టికల్స్ లాంటి వాటి నుంచి రక్షణ కల్పించే ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి.

AC Buying Tips: వేసవిలో ఏసీ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad