Trending

6/trending/recent

Movie Tickets New Rates in AP : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల కొత్త రేట్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో జారీ

Movie Tickets New Rates in AP : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల కొత్త రేట్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో జారీ

Movie Tickets New Rates in AP

న్యూస్ టోన్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల కొత్త రేట్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో గతంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  జరిపిన చర్చల నేపథ్యంలో, సినిమా టికెట్ల రేట్లు పెంపు భీమ్లా నాయక్ విడుదలకు ముందే  ఉంటుందని అందరూ ఆశించారు అయితే మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తో వీటి మీద నిర్ణయం కొంత మేరకు వాయిదా పడింది. అయితే ప్రభుత్వం తాజాగా టికెట్ల రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏ల లో ఉన్న సినిమా థియేటర్ లను బట్టి టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. టికెట్ కనిష్ట ధర 20 రూపాయలు కాగా, గరిష్ట ధర 250 గా పేర్కొంది. 

అన్ని థియేటర్లను ఈ క్రింద పేర్కొన్న విధంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు.

  • నాన్ ఏసీ థియేటర్ల కేటగిరీ
  • ఏసీ థియేటర్ల కేటగిరీ
  • స్పెషల్ థియేటర్ల కేటగిరీ
  • మల్టిప్లెక్స్ థియేటర్ల కేటగిరీ
ఒక్కో థియేటర్ లో ప్రీమియం, నాన్ ప్రీమియం అని రెండు రకాల టికెట్లు ఉంటాయి.

Movie Tickets New Rates in AP - New Rates and Conditions

  • ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలి.
  • కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100
  • కార్పొరేషన్లలో నాన్‌ ఏసీలో టికెట్ ధరలు రూ.40, రూ.60
  • కార్పొరేషన్‌ స్పెషల్‌ థియేటర్లలో రూ.100, రూ.125.
  • కార్పొరేషన్‌ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.150, రూ. 250.
  • మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.60, రూ.80.
  • మున్సిపాలిటీల్లో నాన్‌ ఏసీలో టికెట్ ధరలు రూ.30, రూ.50.
  • మున్సిపాలిటీల్లో స్పెషల్‌ థియేటర్లలో రూ.80, రూ.100.
  • మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.125, రూ. 250.
  • నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70.
  • నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీలో టికెట్ ధరలు రూ.20, రూ.40.
  • నగర పంచాయతీల్లో స్పెషల్‌ థియేటర్లలో రూ.70, రూ.90.
  • నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.100, రూ. 250.
  • ఈ రేట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేసుకునే అవకాశం.
  • హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెన్యూమరేషన్ కాకుండా 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు విడుదల తేదీ నుండి 10 రోజుల పాటు రేట్లు పెంచుకునే వెసులుబాటు.
  • కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజులు రేట్లు పెంచుకునే అవకాశం.
  • రోజు ఐదు షోలు వేసుకునే అవకాశం, తప్పనిసరిగా ఒక షో చిన్న సినిమా వేయాలని ఆదేశం.

Movie Tickets New Rates in AP : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల కొత్త రేట్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో జారీ


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad