Trending

6/trending/recent

DIAGRAM Program for 10th Class Students: పదవ తరగతి లో వెనుకబడిన విద్యార్థుల కొరకు (జోన్-2) డయాగ్రాం కార్యక్రమం

పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జోన్-2, కాకినాడ వారి ఉత్తర్వులు

ప్రస్తుతం శ్రీ మధుసూదనరావు ఎం.ఎ., బి.ఇడి., 

ఆర్ సీ నెం; స్పెషల్/ఎ3/2022,   తేది: 26.03.2022 

విషయం: పాఠశాల విద్య పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు - 2021-22 విద్యా సంవత్సరం - B, C & D గ్రేడ్ విద్యార్ధులకు రెమిడియల్ విద్య DIAGRAM ప్రోగ్రాం అమలు - సూచనలు - గురించి.

****

గత రెండు సంవత్సరాలుగా కరోనా వలన పాఠశాలలు పూర్తి స్థాయిలో నిర్వహించలేక పోయాము. ఫలితంగా విద్యార్ధులు అభ్యాసనాసమయం కోల్పోవడం, ఉపాధ్యాయులు పని గంటలు నష్ట పోవడం జరిగినది. అందువలన విద్యార్ధుల అభ్యాసన స్థాయిలు అతి తక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగినది. అంతేగాక గత రెండు సంవత్సరాలు పదవతరగతి పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించలేక పోవడం మరింత బాధ కలిగించిన అంశం. తత్ ఫలితంగా అన్ని పాఠశాలలోను B, C, D గ్రేడ్ విద్యార్ధులు 70 శాతం వరకూ ఉన్నట్లుగా గుర్తించడం జరిగినది.

కావున B, C, D గ్రేడ్ విద్యార్ధులను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల శిక్షణతో అందరు విద్యార్థులు సులువుగా పాస్ అయ్యేందుకు 30రోజుల DIAGRAM అనే ప్రోగ్రాం ను తయారుచేయడం జరిగినది.

DIAGRAM Program for 10th Class Students

  • DIA అనగా ఫిజిక్స్, జీవశాస్త్రం లోని డయాగ్రంలు (బొమ్మలు), పట్టిక ప్రశ్నలు మరియు గణితంలోని నిర్మాణాలు.
  • GRA అనగా తెలుగు, ఇంగ్లిష్ మరియు హిందీ లోని సబ్జెక్టులోని (గ్రామర్) వ్యాకరణ అంశాలు మరియు గణితంలోని గ్రాఫ్. 
  • M అనగా సోషల్ లోని మ్యాప్ లు మరియు అన్ని సబ్జక్ట్స్ లోని మల్ట్ పుల్ ఛాయస్ ప్రశ్నలతో ఈ DIAGRAM రూపొందించడం జరిగినది. 
  • ఈ కార్యక్రమం స్లోగన్ “రోజు కో బొమ్మ ప్రతి రోజు పది బీట్స్". .
  • ఏ రోజు చదివించిన బిట్స్ పైన, బొమ్మల పైన మరసటి రోజు పరీక్ష పెట్టవలెను. విద్యార్ధులను గ్రూపుగా విభజించి అందరి ఉపాధ్యాయులు దత్తత తీసుకొనవలెను.
  • ఈ మెటీరియల్ చదివిన ప్రతి విద్యార్ధి ఆయా సబ్జక్ట్స్ లో 50 శాతం పైబడి మార్కులు తెచ్చుకోనుటకు అవకాశం ఉన్నది.
  • ఈ DIAGRAM స్టడీ మెటీరియల్ ను ఆయా సబ్జెక్టు లలో పబ్లిక్ పరీక్షలలో వచ్చే ప్రశ్నల ఆధారంగా మరియు వాటి అభ్యాసన సామర్థ్యాల నుండి రూపొందించడం జరిగినది.
  • ప్రతి రోజు విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు నుండి 10 బిట్స్ ఒక మ్యాప్, ఒక డయాగ్రం మరియు గణితం నుండి ఒక నిర్మాణం హోం వర్క్ గా ఇచ్చి మరుసటి రోజు పాఠశాల లో వాటి పై పరీక్షించవలెను. డయాగం స్టడీ మెటీరియల్ అన్ని పాఠశాలకు మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది.
  • స్టడీ మెటీరియల్ 3 భాగాలుగా అనగా పార్ట్ 1 నందు లాంగ్వేజెస్ పార్టీ 2 నందు నాన్ లాంగ్వేజెస్ తెలుగు మీడియం పార్ట్ 3 నందు నాన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మీడియం గా రూపొందించడం జరిగినది.
  • డయాగ్రం స్టడీ మెటీరియల్ నుండి ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు వారి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని ప్రతీ ఉపాధ్యాయుల దగ్గర డయాగ్రం స్టడీ మెటీరియల్ వుండే విధంగా చూసుకొనవలెను.
  • ప్రతీ సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్టడీ మెటీరియల్ 30 రోజులలో శిక్షణ ఇచ్చే విధంగా రోజు వారి ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయవలెను.
  • ప్రతి రోజు విద్యార్ధుల పురోగతి, వెనుకబాటు నమోదు చేస్తూ వెనుకబడిన విద్యార్ధులపై మరింత శ్రద్ధ తీసుకోనవలెను.
  • ఈ ప్రోగ్రాం పూర్తిగా B, C, D గ్రేడ్ విద్యార్ధులు ను దృష్టిలో ఉంచుకొని రుపొందిచడం జరిగినది. • A గ్రేడ్ విద్యార్ధులకు 10/10 గ్రేడ్ సాధించే విధంగా ప్రతేక శిక్షణ ఇవ్వవలెను.

కావున ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ DIAGRAM పద్ధతిని ప్రతి పాఠశాలలో అమలు చేసి 100 శాతం ఉత్తీర్ణుత పొందవలసిందిగా కోరుచున్నాను.

Download Orders Click Here

[post_ads]

DIAGRAM Program for 10th Class Students: పదవ తరగతి లో వెనుకబడిన విద్యార్థుల కొరకు (జోన్-2) డయాగ్రాం కార్యక్రమం

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad