Ads Area

Review on Education Department : పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. 

  • నూతన విద్యావిధానం అమలుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
  • కొత్తగా వర్గీకరించిన ఆరు రకాల స్కూళ్లు, అందులో ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
  • 3 కి.మీ.లోపలే హైస్కూల్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
  • ఈ మార్గదర్శకాలను అనుసరించే మ్యాపింగ్‌ చేస్తున్నామన్న అధికారులు
  • రాష్ట్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అధికారులకు అవగాహనకోసం వర్క్‌షాపు నిర్వహించాం:
  • జిల్లాలస్థాయిలో కూడా నిర్వహించమని కోరారు, ఇవికూడా ఏర్పాటు చేస్తాం:
  • వర్క్‌షాపుల్లో వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటాం:
  • నూతన విద్యావిధానం వల్ల స్కూళ్లు మూతబడుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు:
  • ఇది పూర్తిగా అవాస్తవం:
  • చేస్తున్నది తరగతుల విలీనం తప్ప, స్కూళ్ల విలీనం కాదు:
  • కొత్తగా ఏర్పాటు అవుతున్న స్కూళ్ల వల్ల ఇప్పుడున్న స్కూల్స్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మూతబడవు:
  • దీనిపై కొందరు అనవసరంగా అపోహపడుతున్నారు:
  • పాఠశాలల మూసివేత అనేది ఉండదు:

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..: 

  • వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం
  • విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్న సీఎం
  • సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం
  • నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం
  • వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్న సీఎం
  • వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందన్న సీఎం
  • ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం
  • ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం: సీఎం
  • ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చండి: సీఎం
  • ఒకటి కో – ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్‌ కళాశాలగా మార్చాలి:సీఎం
  • ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్న సీఎం

మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

  • ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు
  • ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం
  • ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 
  • పలురకాల ఆప్స్‌ కన్నా... రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలన్న సీఎం
  • అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్న సీఎం
  • విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీచేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ
  • పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్న ఎస్‌ఈఆర్‌టీ 
  • హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ

వీటికి ఆమోదం తెలిసిన సీఎం

  • స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం
  • ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు
  • త్వరగా పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశం
  • ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు
  • సెప్టెంబరుకల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు
  • జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

ఇది సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం

  • స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలన్న సీఎం
  • ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలన్న సీఎం
  • ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశం
  • పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలన్న సీఎం
  • డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
  • 8,9,10  తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలన్న సీఎం
  • దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలన్న సీఎం

Review on Education Department : పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad