Trending

6/trending/recent

Mangoes: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

 Good News for Mango Farmers: దేశంలో పండే మామిడి పండ్ల (Mangoes) కు ఇతర దేశాల్లో ఎంతలా డిమాండ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ నుంచి దేశవిదేశాలకు మామామి ఎగుమతి అవుతుంటుంది. కాగా.. గత కొంతకాలంగా భారత్ నుంచి అమెరికాకు మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మామిడి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనింది. భారత్ నుంచి అమెరికాకు మామిడి ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) నుంచి అనుమతులు వచ్చినట్లు కేంద్రం (Central Government) వెల్లడించింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమెరికా (America) కు మామిడి ఎగుమతి కానుంది. భారత్ నుంచి మామిడి, దానిమ్మ పండ్లు ఎగుమతి కానున్నాయి. అదేవిధంగా అమెరికా నుంచి చెర్రీ పండ్లు, అల్ఫాల్ఫా ఎండుగడ్డి దిగుమతులు కానున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య పరస్పర ఒప్పందం కుదిరినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల నుంచి అమెరికాకు మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా మామిడి ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఏడాది మార్చి నుంచి ప్రారంభంకానున్నాయి. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర మామిడి రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతోపాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ఈ ఏడాది ఎగుమతులకు అవకాశం కల్పిస్తూ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో భారత మామిడికి విశేష ఆదరణ, డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఏడాది గత రికార్డులను అధిగమించి ఎగుమతులు జరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad