Ads Area

TS Inter 1st Year Result 2021: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇలా చూసుకోండి..

 TS Inter 1st Year Result 2021: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పరీక్షా ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచింది. ఫలితాల కోసం ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి

ఫ‌లితాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి https://tsbie.cgg.gov.in 

459242 మంది విద్యార్థులు ఈ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా.. 224012 విద్యార్థులు పాస్ అయ్యారు.

  • A గ్రేడ్‌లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య -115538
  • B గ్రేడ్‌లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య – 66351
  • C గ్రేడ్‌లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 27752

కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతేడాది పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం ఇంటర్‌ మెదటి ఏడాది విద్యార్థులందరినీ రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసింది. పరిస్థితులు కుదుట పడటంతో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వరకు ఈ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల వాల్యూషన్ 14 కేంద్రాల్లో జరిగింది. వాస్తవానికి బుధవారమే పరీక్షా ఫలితాలు విడుదల అవుతాయని అందరూ భావించారు. కానీ పరీక్షా ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యం జరిగింది.

TS Inter 1st Year Result 2021: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇలా చూసుకోండి..

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad